ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంటే… రేషన్ బియ్యం స్మగ్లింగ్ డాన్ అని ప్రతి ఒక్కరి మనసులో అనిపిస్తుంది. బయట కూడా ఆయన వ్యవహారం తక్కువేమీ ఉండదు. నోటికి ఎంత వస్తే అంత మాట అంటూ ఉంటారు. గతంలో చంద్రబాబు, పవన్ పై ఆయన బూతుపురాణం గురించి చెప్పాల్సిన పని లేదు. అయితే అదే తరహాలో ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు.. మత్స్యకార వర్గాన్ని తీవ్రంగా కించపరిచేలా ఉన్నాయి. వారంతా తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. చివరికి వైసీపీకి .. జగన్ రెడ్డికి ఆప్తుడిగా ఉన్న మల్లాడి కృష్ణారావు కూడా .. ద్వారంపూడిపై ఫైరవుతున్నారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇటీవల కాకినాడ సిటీ టీడీపీ నేత వనమాడి కొండబాబు ను విమర్శించడానికి ప్రెస్ మీట్ పెట్టారు. విమర్శిస్తే సరిపోయేది కానీ.. ఓ కోటి ఖర్చు పెట్టి.. పది కోట్లు అని చెప్పుకునే జాతిరా మీది అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొండబాబు ది మత్స్యకార సామాజికవర్గం. జాతి గురించి మాట్లాడటంతో… ఆ వర్గం ప్రజలు హర్టయ్యారు. తమ గురించి ఇంత నీచంగా మాట్లాడిన ద్వారంపూడిపై వారు ఫైరవుతున్నారు. తర్వాత కవర్ చేసుకోవడానికి ద్వారంపూడి ప్రయత్నించినా.. ఆయన తాను తప్పు మాట్లాడలేదని..తాను కొండబాబు గురించే అన్నానని అంటున్నారు. దీంతో వివాదం అంతకంతకూ పెరుగుతోంది.
మత్స్యకార వర్గం కాకినాడలో అత్యధికంగా ఉంటారు. తర్వాత కాపులు ఉంటారు. రెడ్ల సంఖ్య తక్కువ. కానీ ద్వారంపూడి తన రౌడీయిజం..తో రాజకీయం చేస్తూ వస్తున్నారు. అందర్నీ భయపెట్టి.. గెలుస్తామని అనుకుంటున్నారు. కానీ అన్ని వర్గాలతోనూ సున్నం పెట్టుకున్నారు. పవన్ కల్యాణ్ ను బూతులు తిట్టి.. కాపు వర్గాన్ని .. కొండబాబును అన్నట్లుగా మత్స్యకార జాతిని కించపర్చడంతో పరిస్థితి దిగజారిపోయింది. అందుకేఇప్పుడు ఆయన ఆనపర్తి టిక్కెట్ కావాలని జగన్ ను కోరుతున్నట్లుగా చెబుతున్నారు