సీఎంగా ఉన్నప్పుడు జగన్ పార్లమెంటరీ పార్టీ భేటీలు పెట్టేందుకు ఆసక్తి చూపలేదు. వచ్చే ఎంపీలు నిధులు అడుగుతారని భయమో.. ఇతర సమస్యల గురించి ప్రశ్నిస్తారనో కానీ.. పెద్దగా కలిసేవారు కాదు. కానీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మిగిలిన ఎంపీల్ని పార్లమెంటరీ పార్టీ భేటీలకు పిలుస్తున్నారు. శనివారం నిర్వహించిన సమావేశానికి ఐదుగురు ఎంపీలు హాజరు కాలేదు. ఇప్పుడు హాజరు కావాల్సిన అవసరం లేదనుకున్నారు.
Read More : సచివాలయ వ్యవస్థలో సమూల మార్పులు ?
విజయసాయిరెడ్డి సమావేశానికి హాజరయ్యారు. మొత్తంగా వైసీపీకి పదిహేను మంది ఎంపీలు ఉన్నారు. పదకొండు మంది రాజ్యసభ సభ్యులు, నలుగురు లోక్ సభ ఎంపీలు ఉన్నారు. రాజ్యసభ సభ్యుల్లో పరిమళ్ నత్వానీ ఎప్పుడో కానీ ఏపీ వైపు రారు. ఆయన వైసీపీ సభ్యుడు మాత్రమే కానీ.. ఆ పార్టీతో సంబంధాలు లేవు. ఇప్పుడు అధికారంలో లేదు కాబట్టి అసలు అవకాశాలు లేవు. ఇక నిరంజన్ రెడ్డికి లాయర్ ఫీజు కోసమే పదవి ఇచ్చినట్లుగా ఆయన ఎప్పుడూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనరు.
మరికొంత మంది ఎంపీలు బీజేపీతో టచ్ లో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలో ధర్నా గురించే జగన్ ఎక్కువగా ఎంపీలతో మాట్లాడారు. కలసి వచ్చే పార్టీలను ధర్నాకు పిలవాలని పురమాయించారు. ఎన్డీఏతో సన్నిహితంగా ఉంటున్నందున ఇండియా కూటమి పార్టీలు రావు. ఎన్డీఏలో టీడీపీ ఉన్నందున ఆ కూటమి పార్టీలు రావు. మొత్తానికి జగన్ ఒంటరిగా మారిపోయారు.