తన తొలి సినిమా అఖిల్.. అఖిల్‌ని బాగా నిరాశ పరిచింది. అఖిల్ మాత్రమే కాదు.. నాగ్ కూడా అఖిల్ లాంటి సినిమాతో అఖిల్‌ని ఇంట్రడ్యూస్ చేయడం పొరపాటే అని ఒప్పుకొన్నాడు. అందుకే ఇప్పుడు రెండో సినిమాపై పూర్తి ఫోకస్ పెట్టాడు. మనంతో క్లాసిక్సినిమా అందించిన విక్రమ్ కుమార్ చేతిలో అఖిల్‌ని పెట్టేశాడు. వీరిద్దరి కాంబోలో అన్నపూర్ణ స్టూడియోస్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. నాగార్జున నిర్మాత. ఇప్పటికి యాక్షన్ పార్ట్ మొత్తం పూర్తయిందట. కథానాయిక ఎవరన్నది ఇంకా ఖరారు కాలేదు. అఖిల్ కోసం ఐదుగురు కథానాయికల పేర్లు పరిశీలిస్తున్నామని నాగ్ చెప్పాడు. అయితే.. కొత్త కథానాయికనే పరిచయం చేస్తామని హింట్ ఇచ్చేశాడు నాగ్. ప్రస్తుతం హీరోయిన్లకు స్క్రీన్‌టెస్ట్‌లు చేస్తున్నార్ట. టైటిల్ విషయంలోనూ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని నాగ్ చెప్పుకొచ్చాడు. ”నాలుగు పేర్లు అనుకొంటున్నాం. అందులో ఒకటి సెలెక్ట్ చేస్తాం. అచ్చమైన తెలుగు పేరు పెట్టాలన్నదే నా ఉద్దేశం. త్వరలోనే టైటిల్ విషయంలోనూ ఓ క్లారిటీ వస్తుంది” అన్నాడు నాగ్.