తేదీ : ఫిబ్రవరి 15, 2019, ఉదయం ఏడు గంటలు
సాక్షి టీవీలో స్క్రోలింగ్ : జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మృతి
తేదీ : ఫిబ్రవరి 15, 2019, ఉదయం తొమ్మిది గంటలు
సాక్షి టీవీలో విజయసాయిరెడ్డి : జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మృతి
తేదీ : ఫిబ్రవరి 15, 2019, ఉదయం నుంచి 11 గంటల వరకు
సాక్షి టీవీలో వార్తలు : జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మృతి
ఎక్కడ చూసినా అదే వివేకా గుండెపోటుతో మృతి. కాసేపట్లో అంత్యక్రియలు. పోస్టు మార్టం వద్దు.. కేసు వద్దు అని కుటుంబసభ్యుల ప్రయత్నాలు. చివరికి వివేకా కుమార్తె పట్టుబట్టడంతో పోస్టుమార్టం చేశారు. అప్పుడు బయటపడింది. ఘోరంగా నరికి చంపిన విషయం. చూస్తే ఇంట్లో సాక్ష్యాలు తుడిచేశారు. మొత్తం అవినాష్ రెడ్డి నేతృత్వంలో జరిగింది.
ఇది ఎంత సింపుల్ కేసో సులువుగా అర్థమైపోతుంది. ఐదేళ్లు అయింది. మరి ఎందుకు కేసు సాల్వ్ కాలేదు. వివేకా సొంత అన్న కుమారుడు సీఎం అయ్యారు. ఆయనే చంద్రబాబు హత్య చేయించారని ఆరోపించారు. కానీ విచారణ మాత్రం ముందుకు సాగనీయలేదు. చివరికి కోర్టు సీబీఐకి ఇచ్చింది. ఆ సీబీఐపైనా కేసులు పెట్టారు. చివరికి వివేకా కుమార్తెపైనా నిందలేస్తున్నారు. ఇప్పటికీ ఈ కేసు కోర్టుల్లో నీలుగుతోంది.
సాక్ష్యాలను తుడిచేసినోడు… నిందితుల్ని కాపాడేవాడే.. .. ఆ నేరానికి సుత్రధారి అని క్రైమ్ సూత్రాల్లో ప్రాధమిక అంశం. ఎందుకంటే తాను దొరికిపోతానని..తప్పించుకోవడానికే ఆ ప ని చేస్తారు. ఈ కేసులో ఈ సూత్రాల దిశగా అసలు విచారణ జరపలేదు. జరిపితే అసలు నిందితులు బయటకు వస్తారు. అవినీతి కేసుల సంగతి ఎమో కానీ ఇలా మనుషుల్ని అడ్డగోలుగా నరికిన కేసుల్లోనూ పూర్తి వివరాలు బయటకు తీసుకు రాకుండా… కొద్ది కొద్ది మ్యాటర్ తో నిలిపివేస్తే.. ఇక ఈ దేశంలో ఎవరికి న్యాయం జరుగుతుంది ?
నిందితులు ప్రజలు ఇచ్చిన అధికారంతో .. తమను తాము రక్షించుకుంటున్నారు. ప్రజలు ఆ రక్షణ తీసేస్తే.. అసలు కథ ప్రారంభమయింది. దానికి ఎంతో దూరం లేదని అనుకోవచ్చు. వివేకా హత్య కేసు నిందితులకు.. సూత్రధారులకు శిక్ష పడితేనే ప్రజలకు చట్టం, న్యాయంపై గౌరవం పెరుగుతుంది. లేకపోతే అరాచకవాదులకు బలం పెరుగుతుంది.