ఆర్థిక లావాదేవీల దగ్గరే అన్ని బంధాలూ తెగిపోతుంటాయి. రూపాయి తేడా వస్తే చాలు… అనుబంధాల్లోనూ తేడా వచ్చేస్తుంది. నిన్నా మొన్నటి వరకూ చెట్టా పట్టాలేసుకుని తిరిగి, కలసి ఓ సినిమా తీసిన ఇద్దరు నిర్మాతలు ఇప్పుడు ‘నువ్వెంత’ అంటే ‘నువ్వెంత’ అని కొట్టుకున్నారు. ఓ ఇద్దరు నిర్మాతలు కలసి తీసిన సినిమా ఈ శుక్రవారం విడుదలకు సిద్ధమైంది. ఓ హాస్య నటుడు ఈ సినిమాతో హీరో అవుతున్నాడు. ఇద్దరి నిర్మాతల మధ్య ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయాల్లో గొడవలు మొదలయ్యాయి. ఇద్దరు నిర్మాతల్లో ఓ నిర్మాత డబ్బులు తినేశాడని తెలిసింది. దాంతో రెండో నిర్మాత… వాగ్యూవాదానికి దిగాడు. ఇద్దరి మధ్య గొడవ మైదలైంది. సదరు నిర్మాత ఆఫీసులోనే… ఇద్దరు నిర్మాతలూ కొట్టుకున్నారు. డబ్బులు తినేసిన నిర్మాత, మరో నిర్మాతపై చేయి చేసుకోవడంతో ఇద్దరూ బాహా బాహీకు దిగారు. దాంతో.. ఆఫీసు ఆవరణ మొత్తం ఉత్కంఠ వాతావరణం నెలకొంది. చేయి చేసుకున్న నిర్మాతపై మరో నిర్మాత పోలీసులకు ఫిర్యాదు చేయనున్నాడని సమాచారం. అయితే… సదరు నిర్మాతకు మెగా కాంపౌండ్ అండదండలున్నాయని తెలుస్తోంది. మరి ఈ గొడవ ఎంత వరకూ వెళ్తుందో? ఈ గొడవ విడుదల కావాల్సిన సినిమాపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.