రూలర్ మరి కొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని మలిచారు. యాక్షన్‌కి పెద్ద పీట వేశారు. కె.ఎస్.రవికుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో అలవాటు ప్రకారం బాలయ్య రెండు, మూడు గెటప్పుల్లో దర్శనమివ్వనున్నాడు. ఓ గెటప్ స్టైలీష్గాఉంటే, మరోటి మాస్ లుక్‌తో డిజైన్ చేశారు. మూడో గెటప్ కూడా ఉందని బాలయ్య చెబుతున్నాడు.
ఇందులో బాలయ్య ఇండియాలోనే నెంబర్ వన్ సీఈఓగా కనిపించబోతున్నాడు. మరో పాత్ర పోలీస్ అధికారిగా. అయితే.. ఈ కథలో `గజిని`లక్షణాలు కొన్ని ఉన్నాయని తెలుస్తోంది. సీఈఓని చంపాలని కొంతమంది ప్రయత్నించడం, అందులో భాగంగా ప్రమాదం జరిగి, బాలయ్య గతాన్ని మర్చిపోవడం కథలో కీలకమైన అంశమట. బాలయ్య గతం మర్చిపోవడం ఇదేం కొత్త కాదు. గతంలో లయన్లోనూ ఇలాంటి కథే వండారు. ఇప్పుడు మళ్లీ గతం మర్చిపోవడం, మళ్లీ గుర్తుకురావడం అనే కాన్సెప్ట్ పట్టుకున్నారు.నిజానికి గజిని తరవాత ఈ టైపు కథలు చాలామంది వండి వార్చేశారు. బాలయ్య మళ్లీ అదే కథ ఎలా పట్టుకున్నాడో. కథ అదే అయినా, ట్రీట్మెంట్ వేరుగా ఉంటే జనానికి పట్టేయొచ్చు. మరి కె.ఎస్.రవికుమార్ ఎలా తీశాడో చూడాలి.