చిత్రసీమలో మాట చెల్లుబాటు అవ్వాలంటే చేతిలో హిట్టు ఉండాల్సిందే. దర్శకులైనా, హీరోలైనా, నిర్మాతలైనా.. హిట్టుకే విలువ ఇస్తారు. అందులో తప్పుపట్టాల్సిందేం లేదు. ఫ్లాపులుంటే ఎవరినీ నమ్మరు. ఒకప్పుడు హిట్లిచ్చినంత మాత్రాన కనికరించరు కూడా.
ఒకప్పుడు నాగార్జున వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు ఓ హిట్ ఇచ్చాడు ఓ దర్శకుడు. ఆ సినిమాతో నాగ్ కాస్త తేరుకున్నాడు. అప్పటి నుంచీ ఆ దర్శకుడంటే నాగ్ కి ఎంతో అభిమానం. ఓ దశలో అఖిల్ ఎంట్రీ ఆ దర్శకుడితోనే చేయిద్దామనుకున్నాడు. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఆ దర్శకుడు ఫ్లాపుల్లో ఉన్నాడు. అవకాశాల కోసం ఎంత తిరిగినా పని జరగడం లేదు. ఆ సమయంలో నాగార్జున గుర్తొచ్చాడు. ఓ కథ తయారు చేసుకుని.. నాగ్ చుట్టూ ప్రదక్షణలు చేయడం మొదలెట్టాడు. నాగ్ తిప్పించుకుంటున్నాడు గానీ.. ఆ దర్శకుడికి ఛాన్స్ మాత్రం ఇవ్వడం లేదు. అలాగని `నో` అని కూడా చెప్పడం లేదు. నాగ్ `నో` చెప్పినా.. కనీసం అఖిల్ లేదా, నాగ చైతన్యలతో అయినా సరే, సినిమాని పట్టాలెక్కిద్దామని ఆ దర్శకుడి ఆలోచన. కానీ… నాగ్ మాత్రం కనికరించడం లేదు. మరో దర్శకుడు కల్యాణ్ కృష్ణ పరిస్థితీ ఇంతే. `సోగ్గాడే చిన్ని నాయిన` సీక్వెల్ `బంగార్రాజు` కథతో ఏళ్ల తరబడి నాగ్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. ఈ దర్శకులపై నాగ్ ఎప్పుడు కనికరం చూపిస్తాడో ఏంటో?