ప్రగతి భవన్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్ – కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ భేటీలో అధికారులెవరూ లేరు. ఇది పూర్తిగా రాజకీయ పరమైన సమావేశం. జగన్ వెంట.. విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డి మాత్రమే ఉన్నారు. ప్రగతి భవన్లో కూడా.. తెలంగాణ అధికారులెవరూ లేరు. అంటే.. పూర్తిగా రాజకీయాలపైనే చర్చ జరుగుతోంది. అవేమిటో.. అంత తేలిగ్గాబ యటకు రావు. ఎందుకంటే.. కేసీఆర్, జగన్ మధ్య ముఖాముఖి చర్చే ఎక్కువగా జరుగుతుంది. అయితే.. మధ్యాహ్నం ప్రగతి భవన్కు జగన్, విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డి వెళ్లిన తర్వాత.. సోషల్ మీడియాలో మాత్రం.. పూర్తిగా విజయసాయిరెడ్డినే కనిపించారు. దానికి కారణం.. ఆయన కేసీఆర్ కాళ్లకు నమస్కారం పెట్టేయడమే.
కేసీఆర్ కన్నా విజయసాయిరెడ్డి రెండేళ్లు పెద్ద. పెద్దలకు పాదనమస్కారం పెట్టడం తప్పేముందని.. వాదన చెప్పడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. కానీ పదవిలో మాత్రం… హైదరాబాద్లో ఉన్న అనేక వ్యాపారపరమైన లింకుల విషయంలో మాత్రం.. కేసీఆర్ ఆశీస్సులు విజయసాయిరెడ్డికి చాలా ముఖ్యం. అందుకే విజయసాయిరెడ్డి మీడియా కెమెరాలు ఉన్నా.. ఫోటోలు తీస్తున్నా.. వెనక్కి తగ్గలేదు. కేసీఆర్ ఎదురుగా రాగానే.. కాళ్లపై పడిపోయారు. ప్రగతి భవన్ మీడియా వర్గాలు కూడా.. ఏ మాత్రం సంకోచించకుండా.. ఆ వీడియోలను..ఫోటోలను విడుదల చేశారు. దీంతో సోషల్ మీడియా గేమ్ ప్రారంభించింది.
విజయసాయిరెడ్డి పాద నమస్కారాలకు పెట్టింది పేరు. ఒకప్పుడు ఆయన ఎలా ఉండేవారో కానీ.. ఢిల్లీలో పనులు ఎలా చక్కబెట్టుకోవాలో అర్థం అయిన తర్వాత మాత్రం ఆయన కాళ్లపై పడటం నేర్చుకున్నారు. గవర్నర్ సహా.. ఎవరికైనా సరే ఆయన పాదనమస్కారాలు చేయనిదే వదిలి పెట్టారు. పార్లమెంట్లో మోడీ కాళ్లకు నమస్కరించి.. ఓ సారి సంచలనం సృష్టించారు. తాను మాత్రమే కాదు.. జగన్మోహన్ రెడ్డికి కూడా.. అదే అలవాటు చేశారు రాష్ట్రపతిగా ఎన్నికవక ముందే కోవింద్… హైదరాబాద్ పర్యటనకు వస్తే.. కాళ్ల మీద పడిపోయారు. ఆ తర్వాత మోడీ.. తిరుపతి పర్యటనకు వస్తే.. అదే చేశారు. పెద్దల కాళ్లకు నమస్కారాలు పెడితే తప్పే ముందుని వైసీపీ నేతలు..వాదిస్తూంటారు కానీ.. పులి..అని మరొకటని ప్రచారం చేస్తూ.. ఇలా కేసుల భయంతోనే. కాళ్లపై పడిపోవడం ఏమిటన్న చర్చ సోషల్ మీడియాలో జరుగుతూనే ఉంటుంది.