‘సైరా నరసింహారెడ్డి’ టీజర్‌తో మెగా ఫ్యాన్స్‌లో పూనకాలు మొదలైపోయాయి. టీజరే ఇలా ఉంటే.. సినిమా ఇంకా ఏ రేంజులో ఉంటుందో అంటూ ఊహల పల్లకిలో ఊరేగుతున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అది… `సైరా` సంగీతం గురించి. ఇందులో పాటలు చాలా తక్కువగా ఉంటాయని తెలుస్తోంది. ఉన్న పాటలు కూడా పూర్తిగా జానపద శైలిలో సాగుతాయని సమాచారం. రాయలసీమ మాండలికంలో ఓ పాట ఉంటుందని, ఓ పాట పూర్తిగా ఫోక్ బీట్ తో సాగుతుందని, నేపథ్య గీతాలకు తప్ప.. దాదాపుగా బృంద గానాలకు ఎక్కడా చోటు లేదని తెలుస్తోంది. అతనికి ఇద్దరు భార్యలు. ఈ నేపథ్యంలో ఓ ప్రేమ గీతానికీ చోటు దక్కుతుందని సమాచారం. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేదీ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ట్యూన్లు సిద్ధమైపోయాయని సమాచారం. నేపథ్య సంగీతానికి చాలా స్కోప్ ఉన్న సినిమా ఇది. ఆ విషయంలో ఆరితేరిపోయినందుకే అమిత్ త్రివేదిని ఈ సినిమా కోసం ఎంచుకున్నార్ట. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఓ పాటని రాస్తున్నారు. అది పూర్తిగా జానపద శైలిలో సాగుతుందని తెలుస్తోంది. మొత్తానికి చిరు నుంచి వచ్చే ఓ విభిన్నమైన ఆల్బమ్ `సైరా`. మరి ఆ పాటలెలా ఉంటాయో తెలియాలంటే.. ఇంకొన్నాళ్లు ఆగాలి.