కేటాయించిన నిధుల్ని విడుదల చేయడం లేదని రాష్ట్రప్రభుత్వంలో అన్ని శాఖల మంత్రులు, అధికారులూ ఆర్ధిక మంత్రిత్వ శాఖ మీద గుర్రుగా వున్నాయి. ”విడుదల చేసిన నిధులకు లెక్కచెప్పి కొత్త నిధులు తీసుకువెళ్ళవచ్చు. ఇందుకు వేరే శాంక్షన్లు అవసరం లేదు” అని ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు బదులిస్తున్నారు. సిట్యుయేషన్ మంత్రిగారు చెప్పినంత ఈజీగా లేదు ఏదో కొర్రీవేసి రిలీజ్ ఆపేస్తున్నారు అని అధికారులు చెబుతున్నారు.
ఇందులో రెండు వాదనలూ నిజమే! ఆర్ధిక ఇబ్బందుల వల్ల నిధులు ఆపడానికి చిన్న వంక దొరికినా నిధులు ఆపేయడమూ నిజమే! ఈ స్ధితిలో మళ్ళీ డబ్బు ఎప్పుడు వస్తుందోనని రూపాయికి రెండు రూపాయల ప్రతిపాదనలు పెడుతూండటమూ నిజమే! ఈ నేపధ్యంలో తన శాఖపై పెరుగుతున్న వత్తిడిని తగ్గించుకోడానికీ, అదేసమయంలో వచ్చే బడ్జెట్ కేటాయింపులపై అవగాహన పెంచుకోడానికీ ఆర్ధిక మంత్రి రామకృష్ణుడు శాఖల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఇందులో భాగంగా ముందుగా ఈ వారం జలవనరుల శాఖతో సమావేశం జరుగుతుంది.
దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలతో ప్రత్యేకించి జలవనరులశాఖకు ఆర్ధిక శాఖకు మధ్య బిగుసుకుంటున్న ఘర్షణాత్మక ధోరణులను నివారించడానికి కూడా ఈ సమావేశాలు దోహదపడాలన్నది ఆర్ధిక మంత్రి ఆలోచన!
దీనికోసం నీటిపారుదల శాఖ తాను నిర్వహిస్తున్న పథకాల వివరాలు, చేసిన ఖర్చుపై నివేదిక సిద్ధం చేసింది. ఏయే పథకాలకు ఎరత నిధులు ఖర్చు చేశారు, ఎంతమేరకు పనులు జరిగాయన్నదానిపై చర్చ జరగనురది. వైఎస్ రాజశేఖ రరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 87 ప్రాజెక్టులతో జలయజ్ఞాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అయితే ఖర్చు చేసిన నిధులకు ఫలితాలు రాకపోవడంతో ఈ పథకాల నిర్మాణంపై విమర్శలు కూడా ప్రారంభమయ్యాయి.
కళ్లు తెరిచిన యంత్రాంగం చివరి దశలో ఉన్న ప్రాజెక్టులను ముందుగా పూర్తి చేసేలా ప్రాధాన్యతల క్రమాన్ని రూపొందించారు. ముఖ్యమంత్రులు రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాధాన్యతా ప్రాజెక్టులనే ముందుగా పూర్తి చేయాలన్న మాటలు పదేపదే చెప్పినప్పటికీ ఇప్పటికీ అవి పూర్తికాలేదు. ఇప్పుడు తాజాగా చంద్రబాబు కూడా అదే మాటలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్ధిక శాఖ ప్రాజెక్టుల్లో ప్రాధాన్యతలపై దృష్టి పెట్టాలని యోచిస్తోరది. ప్రధానంగా ఎన్ని ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగుతోంది, వాటిల్లో ఎన్ని పూర్తయ్యే దశలో ఉన్నాయి, వాటికి ఇప్పటివరకు ఎంత నిధులు ఖర్చు చేశారు అన్న వివరాలు తెప్పించుకుని అధ్యయనం చేయాలని నిర్ణయిరచారు.
ప్రాధాన్యతా ప్రాజెక్టులను పూర్తిచేసేరదుకు ఆర్ధిక శాఖ నుంచి ఆశించిన నిధులు ఇవ్వడం లేదని నీరపారుదల శాఖ అధికారులు అంటున్నారు. ఇదే విషయాన్ని ఆర్ధిక శాఖ దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు వారు చెబుతున్నారు. ప్రస్తుతం పలువురు కాంట్రాక్టర్లకు 500 కోట్ల రూపాయల వరకు చెల్లించాలని అంటున్నారు.
అయితే సక్రమమైన బిల్లులు తమకు వస్తే వాటిని ఆమోదించి నిధులు ఇస్తున్నామని ఆర్ధిక శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.