తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. 12 మంది సభ్యులున్న ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో బాలు చికిత్స పొందుతున్నారు. ప్రతీ రోజూ సాయింత్రం బాలుకి సంబంధించిన హెల్త్ బులిటెన్ విధిగా విడుదల అవుతోంది. బాలు ఆసుపత్రి ఖర్చులన్నీ తమిళ నాడు ప్రభుత్వమే భరిస్తోంది. తాజాగా.. బాలు కోసం విదేశాల నుంచి వైద్యుల్ని రప్పించారని సమాచారం. ప్రస్తుతం బాలు వెంటిలేటర్‌పైనే ఉన్నారు. వారం రోజులుగా ఆయనకు కృత్రిమ శ్వాసే అందిస్తున్నారు. ప్రస్తుతం బాలు ఆరోగ్య స్థితి ప్రమాదకరంగానే ఉన్నా, చేయి దాటి పోలేదని తెలుస్తోంది. పీఎమ్ ఆఫీసు కూడా ఎప్పటికప్పుడు బాలు క్షేమ సమాచారాలు సేకరిస్తోంది. మరోవైపు బాలు కోసం సామూహిక ప్రార్థనలు చేయాలని తమిళ చిత్రసీమ పిలుపునిచ్చింది.ఈరోజు సాంత్రం 6 గంటలకు బాలు కోసం ప్రార్థనలు మొదలవుతాయి.