హైదరాబాద్: విజయవాడ కృష్ణలంకలో కాంగ్రెస్ నాయకుడు మల్లాది విష్ణుకు చెందిన స్వర్ణ బార్లో మద్యం తాగి ఐదుగురు చనిపోయిన ఘటనకు సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక ఇవాళ వెలువడింది. కల్తీ మద్యంలో లేదని, నీళ్ళలోనే జరిగిందని ఆ నివేదికలో పేర్కొన్నారు. నీళ్ళలో సైనైడ్ కలిసినట్లు పేర్కొన్న ఆ నివేదికను సిట్ అధికారులు ఇవాళ కోర్టుకు సమర్పించారు. మరోవైపు సిట్‌లో మల్లాది విష్ణు కస్టడీ ఇవాళ ముగిసింది. మరో మూడు రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ సిట్ అధికారులు కోర్టును కోరారు. ఫోరెన్సిక్ నివేదిక కాపీని తమకు ఇవ్వాలంటూ మల్లాది విష్ణు తరపు న్యాయవాదులు కూడా కోర్టును అభ్యర్థించారు.