కెమెరామెన్ శ్యామ్ కె.నాయుడు ఇటీవల వార్తల్లోకెక్కారు. తనని ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని మోసగించినట్టు నటి సాయి సుధ… శ్యామ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో శ్యామ్ అరెస్ట్ అయ్యారు. రిమాండ్ లో ఉండి, బెయిల్‌పై వచ్చారు. అయితే ఇప్పుడు ఫోర్జరీ కేసులో మరోసారి అరెస్ట్ అయ్యారు.
సాయిసుధతో తనకి రాజీ కుదిరిపోయిందని, బెయిల్ మంజూరు చేయమని… నాంపల్లి కోర్టుని శ్యామ్ ఆశ్రయించారు. దాంతో నాంపల్లి కోర్టు శ్యామ్‌కి బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆ పత్రాలలో సాయిసుధ సంతకాన్ని శ్యామ్ ఫోర్జరీ చేసినట్టు తేలింది. దాంతో ఫోర్జరీ కేసుతో పాటు, న్యాయస్థానాన్ని మోసం చేసిన కేసులోనూ ఇరుక్కున్నాడు శ్యామ్. శ్యామ్ ఫోర్జరీ చేసినట్టు ధృవీకరణ అవ్వడంతో శ్యామ్‌కి ఇచ్చిన బెయిల్ ని కోర్టు రద్దు చేసింది. దాంతో ఆయన్ని మరోసారి ఆరెస్ట్ చేశారు పోలీసులు.