హిందూపురం లోక్సభ నియోజకవర్గం నుంచి… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థిగా పోటీ చేస్తున్న గోరంట్ల మాధవ్… ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై మీసం మెలి తిప్పాడన్న విషయం మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ ఆయన ఖాకీ డ్రెస్ వేసుకున్న కొద్ది కాలంలోనే… మూటగట్టుకున్న అప్రతిష్ట అంతా ఇంతా కాదు. ఆయన విధి నిర్వహణ తీరుతో.. ఆయనపై అనేక కేసులు నమోదయ్యాయి. అనేక సార్లు ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురయ్యారు. అయితే.. ఇవన్నీ.. ఓ ఎంపీ మీద మీసం తిప్పినట్లుగా… విధి నిర్వహణలో ఎవర్నీ లెక్క చేయకపోవడం కాదు. పెద్దల అండతోనే.. పోస్టింగులు పొందిన ఆయన… సామాన్య జనంపై మాత్రం ప్రతాపం చూశారు. దానికి ఓ చిన్న ఉదాహరణ… నోట్ల రద్దు సమయంలో అనంతపురంలో ఓ ఏటీఎం వద్ద జరిగిన ఘటన..!
నోట్ల రద్దు సమయంలో… ఏటీఎంల దగ్గర చాంతాడంత క్యూలు ఉన్నాయి. అనంతపురంలోనూ ఉన్నాయి. అలా ఉన్న ఏటీఎం వద్ద.. ఓ పెద్దాయని పోలీసులు చితక్కొట్టిన ఘటన.. దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ఇప్పటికీ యూట్యూబ్లో ఆ వీడియో హైలెట్. ” ఈ పబ్లిక్ నా కొడుకులకు లాఠీ దెబ్బ పడితేగానీ దారిలోకి రారు’..అంటూ నోట్ల రద్దు సమయంలో బ్యాంకు ఏటీఎంల వద్ద లైన్లో నిల్చున్న ఒక ప్రభుత్వ ఉద్యోగిని బొక్కలిరగ్గొట్టి మరీ మీసాలు మెలేసిన ఘన చరిత్ర గోరంట్ల మాధవ్ ది. ఈ ఘటన సంచలనం సృష్టించింది. పోలీస్ అధికారికి ఇంత అహంకారమా అని అందరూ అనుకున్నారు. అప్పట్లో ఆయన అనంతపురం సీఐగా ఉండేవారు. ఇది.. జాతీయ స్థాయిలో హైలెట్ కావడం.. కేసులు కూడా దాఖలు కావడంతో… ఆయనపై చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా కదిరికి పంపారు.
కానీ అక్కడ కూడా.. సంబంధం లేకపోయినా… జేసీ దివాకర్ రెడ్డి మీద.. మీసం మెలేసి… రాజకీయ భవిష్యత్ వెదుక్కున్నారు. ఆయన తీరు..వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా నచ్చేసిందేమో కానీ… పిలిచి మరీ… లోక్సభ టిక్కెట్ ఇచ్చేశారు. సీఐగానే ఆయన అంతగా.. పబ్లిక్ పై లాఠీ ఝుళిపించిన ఆయన.. ఎంపీ అయితే.. ఇంకేమీ చేస్తారోనన్న దడ ప్రజల్లో ప్రారంభమయింది.