ఎన్నికల సమయంలో జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడేవారి సంఖ్యను పెంచడంలో సాక్షి పత్రిక తనదైన కీలక భూమిక పోషిస్తుంది. ఎవరైనా తమను విమర్శిస్తున్నారో.. లేకపోతే టీడీపీకి మద్దతుదారుడని అనిపిస్తే చాలు వాళ్లపై పడిపోయి.. పుంఖాను పుంఖాలుగా కథనాలు రాసేస్తోంది. అవతలి వ్యక్తి రెస్పాండ్ అయితే ఎంత డ్యామేజ్ జరుగుతుందో ఊహించడం లేదు. ముందు బురద చల్లడమే పనిగా పెట్టుకుంది.
తాజాగా సీబీఐ మాజీ డైరక్టర్ నాగేశ్వరరావు వైసీపీపై ఫైరయ్యేలా కథనాలు ప్రసారం చేశారు. ఇటీవల హైదరాబాద్ లో మాజీ సీఈసీ వీఎస్ సంపత్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో నాగేశ్వరరావు పాల్గొన్నారు.ఆ సమావేశంలో ఏపీ ఎన్నికలను పరిశీలించడానికి ఎలక్షన్ వాచ్ ఒకటి ఉండాలన్నారు. ఆ సమావేశంలో నాగేశ్వరరావు కూడా పాల్గొనడతో ఆయన అవినీతి పరుడు అంటూ సాక్షిలో కథనాలు రాశారు. దీనిపై ఆయన సోషల్ మీడియాలో సుదీర్ఘమైన పోస్టు పెట్టారు. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నారని… తనపై చేసిన ఆరోపణలకు తగ్గట్లుగా కేంద్రం హోంశాఖ వద్ద ఉన్న ఆస్తుల జాబితా కన్నా తన వద్ద ఎక్కువ ఉంటే సాక్షికే దానమిచ్చేస్తానని ప్రకటించారు.
గుమ్మడికాయ దొంగ ఎవరు అని అనకముందే సాక్షి మీడియా, వైకాపా ప్రముఖులు భుజాలు ఎందుకు తడుముకొంటున్నారో?
1. ఆంధ్ర ప్రదేశ్ లో Citizens For Democracy (ప్రజాస్వామ్యం కోసం పౌరులు) అనే Civil Society (పౌర సమాజం) చొరవలో నేను భాగమనే తప్పుడు ఊహతో ఆ రాష్ట్రంలోని అధికార వైకాపాకి చెందిన సాక్షి…
— M. Nageswara Rao IPS (Retired) (@MNageswarRaoIPS) April 18, 2024
అవినీతి కూపంలో కూరుకుపోయిన వారికి, నిజాయితీ, చిత్తశుద్ధి కలిగిన వ్యక్తులు అతిపెద్ద శత్రువులు. ఎందుకంటే నిజాయితీపరుల ఉనికి వారి అవినీతిని ఎత్తిచూపుతుంది. కాబట్టి, వారు తమ అవినీతిని కప్పిపుచ్చుకునే వ్యర్థ ప్రయత్నంలో నిజాయితీపరులపై ఎప్పుడూ బురద చల్లుతుంటారని మండిపడ్డారు. నిజానిక నాగేశ్వరరావు సీబీఐ డైరక్టర్ గా పని చేసినప్పుడు ఆయనను కాకా పట్టేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నించిందనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఆయనపై చాలా సమయం .. పేపర్ వెచ్చింది పెద్ద కథనాలే రాస్తున్నారు. కానీ రివర్స్ లో ఆయన ఒక్క సోషల్ మీడియా ప్రకటన చేసి.. సాక్షి పరువు తీశారు.