హైదరాబాద్: మైనింగ్ డాన్ గాలి జనార్దనరెడ్డి బెయిల్ స్కామ్‌లో నిందితుడైన మాజీ జడ్జి ప్రభాకరరావు ఇవాళ హైదరాబాద్‌లో అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. కుటుంబసభ్యులు మాత్రం గుండెపోటుతో చనిపోయాడని చెబుతున్నారు. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో ఆరోపణలపై సస్పెండ్ అయిన ప్రభాకరరావు జైలుకు కూడా వెళ్ళారు. ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చారు. అన్యాయంగా తనను కేసులో ఇరికించారంటూ న్యాయపోరాటం చేస్తున్నారు. అవమానభారంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మృతదేహం గాంధీ ఆసుపత్రి మార్చురీలో ఉంది. పోస్ట్ మార్టమ్‌కు పంపారు.
అక్రమ మైనింగ్ కేసులో జైలులో ఉన్న గాలి జనార్దనరెడ్డిని బయటకు తీసుకొస్తానంటూ హైదరాబాద్‌కు చెందిన యాదగిరి అనే రౌడీషీటర్ రు.100 కోట్ల కాంట్రాక్ట్ కుదుర్చుకున్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ కేసులో మొత్తం ముగ్గురు జడ్జిలపై హైకోర్ట్ వేటు వేసింది. ప్రభాకరరావు పట్టుబడటానికి ముందు శ్రీకాకుళంలో ఫ్యామిలీ కోర్ట్ జడ్జిగా ఉన్నారు. ఈ కేసులో గాలి జనార్దనరెడ్డి సోదరుడు సోమశేఖర్ రెడ్డి కూడా ఒక నిందితుడు.