ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పెద్ద మాస్టర్ ప్లాన్‌లోనే ఉన్నారు. తనకు మంచి డీల్ ఇస్తే పార్టీలో చేరుతానని జాతీయ పార్టీలతో పాటు టీడీపీ వంటి వాటికి కూడా సంకేతాలు పంపుతున్న ఆయన.. మరో వైపు సొంత పార్టీ ప్లాన్ చేసుకుంటున్నారు. ఓ పార్టీలో చేరితే ఖమ్మం జిల్లాలో మాత్రమే ప్రభావం చూపిస్తానని అదే సొంత పార్టీ పెట్టుకుంటే నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో దున్ని పారేస్తానని ఆయన లెక్కలేసుకుంటున్నట్లుగా సన్నిహితులు చెబుతున్నారు.ఈ క్రమంలో ఆయన కొత్త పార్టీ ప్రయత్నాలు కూడా ప్రారంభించేశారని చెబుతున్నారు.
టీఆర్ఎస్ అని వచ్చేలా.. “తెలంగాణ రైతు సమితి” అనే పేరుతో పార్టీ రిజిస్ట్రేషన్ కోసం సీఈసీకి దరఖాస్తు చేసినట్లుగా ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పొంగులేటి రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అన్ని నియోజకవర్గాల్లో తన అభ్యర్థులను ప్రకటించి వారి కోసం రాజకీయం చేస్తున్నారు . ప్రచారం ప్రారంభించారు. ఏ పార్టీలో చేరిన వారంతా ఆ పార్టీ అభ్యర్థులని ఆయన చెబుతున్నారు. ఈ విషయంలో ఆయన వెనక్కి తగ్గే అవకాశాలు లేవు. ఇప్పుడు కొత్తగా సొంత పార్టీ గురించి బయటపెడుతున్నారు. సొంత పార్టీ అనేది అంతర్గగతంగా జరుగుతున్న వ్యవహారం అని… కొంత కాలంగా ప్రచారం జరుగుతోదంది.
పొంగులేటితో పాటు మరో ఇద్దరు మాజీ టీఆర్ఎస్ నాయకులతో కలిసి పార్టీ పెట్టాలని పొంగులేటి సిద్దమయ్యారని చెబుతున్నారు. బీఆర్ఎస్ ఓటు బ్యాంక్‌కు గండి పెట్టేలా.. ఆ పార్టీని ఓడించడానికి ప్రత్యేక ప్లాన్ ఉందని కూడా చెబుతున్నారు. పొంగులేటికి ఆర్థిక పరమైన ఇబ్బందులు లేవు. ఎన్నికలు ఎలా అయినా చేయగలరు. అందుకే ఆయన కొత్త పార్టీ పెట్టవచ్చని ఎక్కువ మంది నమ్ముతున్నారు.