ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో కాంగ్రెస్ నేత సి. రామచంద్రయ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, తెదేపా-బీజేపీల పొత్తుల గురించి కొన్ని ఆసక్తికరమయిన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు నాయుడు ఏదో ఒకరోజు బీజేపీతో తెగతెంపులు చేసుకోవడం తధ్యం. ప్రస్తుతం కేంద్రప్రభుత్వ సహాయ సహకారాలు చాలా అవసరం గనుక ప్రధాని నరేంద్ర మోడి ముందు అణిగిమణిగి ఉంటున్నప్పటికీ, బీజేపీ బలహీనపడినట్లయితే దానిని తప్పకుండా వదిలించుకొంటారు. బిహార్ ఎన్నికల తరువాత బీజేపీ కొంచెం బలహీనపడింది కనుక దానితో పొత్తులను కొనసాగించాలా…వద్దా? అనే ఆలోచనలు చేస్తుంటే ఆశ్చర్యం లేదు. ఏరు దాటాక తెప్ప తగలేసే అలవాటున్న చంద్రబాబు నాయుడు బీజేపీ ఇక తనకి పనికిరాదని భావించిన మరుక్షణం దానిని వదిలించుకోవడానికి వెనుకాడరు. చంద్రబాబు నాయుడు అమాయకుడయిన పవన్ కళ్యాణ్ న్ని తన రాజకీయ చదరంగంలో పావుగా వాడుకొంటున్నారు. పవన్ కళ్యాణ్ భుజం మీద తుపాకి పెట్టి నరేంద్ర మోడీకి గురిపెట్టే ప్రయత్నం చేయవచ్చును,” అని అన్నారు.