వైసీపీ నుంచి బయటపడే మార్గాన్ని కీలక నేతలు వెదుక్కుంటున్నారు. ముఖ్యంగా టీడీపీలో ఉండి.. వైసీపీలో చేరిన వారికి ఉక్కపోత తప్పడం లేదు. అధికారం ఉంది కదా అని పోతే అక్కడ అధికారం అనుభవించలేదు సరి కదా.. ఇప్పుడు పట్టించుకునే దిక్కు కూడా లేకుండా పోయింది. అందుకే ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే మద్దాళి గిరి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు.
జిన్నింగ్ మిల్లు నడిపించుకునే మద్దాళిగిరికి చంద్రబాబు పిలిచి 2014లో గుంటూరు తూర్పు టిక్కెట్ ఇచ్చారు. ప్రతీ సారి ముస్లింకు ఇస్తున్నారు కాబట్టి.. అప్పుడు బీజేపీతో పొత్తులో ఉన్నందున హిందూ అభ్యర్థిని నిలబెట్టి ప్రయోగం చేశారు. కొద్ది తేడాతో ఓడిపోయారు. అయినా టీడీపీ గెలవడంతో ఐదేళ్లు అనధికారిక ఎమ్మెల్యేగా చెలామణి అయ్యారు. 2019 నాటికి మళ్లీ ఈస్ట్ లో ముస్లిం అభ్యర్థికి టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించడంతో.. ఆయనకు టిక్కెట్ ఖరారు చేయలేదు. అయితే పార్టీకి లాయల్ గా ఉంటారని చెప్పి కుంచుకోట అయిన గుంటూరు పశ్చమ కేటాయించారు.
Also Read : పోలీసులను బెదిరించిన పులివెందుల ఎమ్మెల్యే జగన్ !
తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ ఆయనకు ఇతర నేతలు సహకరించారు. గెలిచారు. కానీ టీడీపీ ఓడిపోవడంతో.. వెంటనే వైసీపీలోచేరిపోయారు. చంద్రబాబును , టీడీపీని నానా మాటలన్నారు. చివరికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడానికి డబ్బులు ఆఫర్ చేశారని కూడా ఆరోపించారు. అయితే ఆయన ఎందుకూ పనికి రాని నేత అని జగన్ కూడా తీర్మానించి టిక్కెట్ కూడా ఇవ్వలేదు. అయినా విడదల రజనీ కోసం పని చేశారు. ఓ పోలింగ్ బూత్‌లో ఆయనను ఓటర్లు కొట్టబోయారు కూడా. ఓడిన తర్వతా నిన్నామొన్నటి వరకూ సైడ్ క్యారెక్టర్ గా నిలబడేందుకు వైసీపీ ఆఫీసు నుంచి కార్యక్రమాలకు పిలిచేవాళ్లు. ఇప్పుడు అది కూడా లేకపోవడంతో వైసీపీకి రాజీనామా చేసేశారు.
మరో టీడీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే కరణం బలరాం కూడా టీడీపీలోకి వస్తానని రాయబారాలు నడుపుతున్నారు. కానీ ఎవరూ స్పందించడం లేదు. వల్లభనేని వంశీ అసలు అడ్రస్ లేకుండా పోయారు. మరో ఫిరాయింపు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్.. టీడీపీ గ్రీన్ సిగ్నల్ కోసం.. ఎదురు చూస్తున్నారు.