నటుడు ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు “మా” ఎన్నికల లో భారీ మెజారిటీతో గెలవడం పై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్ కూడా అసోసియేషన్ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్ ఓడిపోవడం పై ఆయన అసోసియేషన్ సభ్యత్వానికి రాజీనామా చేయడం పై మాజీ ఎంపీ హర్షకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే..
మాజీ ఎంపీ హర్షకుమార్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, ” ప్రకాష్ రాజ్ గారు, ఇప్పుడే చూసాను మీరు “మా” సభ్యత్వం నుండి వైతొలుగుతున్నారని. కానీ అది మంచి నిర్ణయం కాదు.మీరు నెగ్గాలని ఒక్క హిందూ మతోన్మాదులు తప్ప సామాన్య ప్రజానీకం అందరూ కోరుకున్నారు.తమ ప్రభావం తగ్గలేదు అని చెప్పటానికి పరిశ్రమ మా చేతుల్లోనే ఉంది అని చెప్పడానికి కమ్మ వర్గము అంతా కలిసిపోయింది.మెగా ఫామిలీ ని కాపులను అదుపులో ఉంచాలని అధికారంలో ఉన్న రెడ్డి వర్గము వారినే సపోర్ట్ చేసింది. ప్రకాశ్ రాజ్ vs ANR, NTR, Krishna, manchu…ఫామిలీస్. chandrababu, jagan mohan reddy and BJP. ఇది మీ గెలుపే…ప్రజల దృష్టిలో మీరే నెగ్గారు. ఇన్ని శక్తులను తట్టుకొని మీకు ఓటు వేసిన వాళ్ళను, డబ్బును కూడా తట్టుకొని వేసిన వాళ్ళను బయటనుంచి నైతికంగా ఎంతో సపోర్ట్ చేసిన ప్రజల గురించి మీ నిర్ణయాన్ని పున సమీక్షించుకోండి. మీ పూర్తి ప్రెస్ మీట్ చూసాక మీ నిర్ణయం సహేతుకమైనదే అని అనిపించింది.” అని రాసుకొచ్చారు.
సినిమా ఆర్టిస్ట్ ల ఎన్నికలు ఈసారి రాజకీయంగా కూడా ఆసక్తిని కలిగించాయి. ప్రకాష్ రాజ్ ఓటమిని సమర్థిస్తూ బండి సంజయ్ ఈరోజు ట్వీట్ చేస్తే, మాజీ ఎంపీ హర్షకుమార్ ప్రకాష్ రాజ్ ని సమర్థిస్తూ పోస్ట్ చేయడం గమనార్హం. మొత్తానికి ప్రకాష్ రాజ్ ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు నాన్ లోకల్ కారణం చూపించి ఓడించడం తో సామాన్య ప్రజల్లో కూడా ప్రకాష్ రాజ్ పై సింపతి పెరుగుతోంది.