హీరోయిన్ జెత్వానీ కేసులో పరారీలో ఉన్న కుక్కల విద్యాసాగర్ ను పోలీసులు అరెస్టు చేశారు. డెహ్రాడూన్ లో దాక్కుని తన స్నేహితుడి ఫోన్ వాడుతున్న ఆయనపై నిఘా పెట్టి పోలీసులు పట్టుకున్నారు. అక్కడ ఆయన దొరికినట్లుగా తెలియగానే ఇక్కడ విజయవాడ మాజీ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా హైకోర్టులో మందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. నిజానికి కాంతి రాణాను సస్పెండ్ చేశారు కానీ ఇంత వరకూ ఎఫ్ఐఆర్ దాఖలు చేయలేదు.
కేసు నమోదు కాకండానే ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. సోమవారం పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. జెత్వానీ ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో ఏ వన్ గా కుక్కల విద్యాసాగర్ ను పెట్టారు. అదర్స్ అని పెట్టారు కానీ.. ఇంకా ఐపీఎస్ అదికారుల పేర్లను చేర్చలేదు. కుక్కల విద్యాసాగర్ దొరికాడు కాబట్టి తదపరి చర్యల్లో భాగంగా ఎఫ్ఐఆర్లో పేర్లను చేర్చి అరెస్టు చేసే అవకాశం ఉంది. అయితే ఎఫ్ఐఆర్లో పేర్లు చేర్చి.. కోర్టుకు వచ్చే చాన్స్ చాన్స్ లేకుండా అరెస్టు చేస్తామోనని కాంతి రాణా భయపడుతున్నారు.
ఇప్పటికే కాంతి రాణా అరాచకంపై పూర్తి స్థాయిలో ఆధారాలతో సహా ప్రభుత్వం వద్ద ఉంది. అందుకే సస్పెండ్ చేశారు. ఆయన చేసిన తప్పులకు.. ఐపీఎస్ సర్వీస్‌కు చేసిన ద్రోహానికి కొల్లేటర్ పనిష్మెంట్ ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న భయంతో టాటా ఉన్నారు. అందుకే ఆయన కంగారు కంగారుగా ముందే కోర్టుకెళ్లిపోయారు.