మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాం పెద్దన్నగారు ఏ.పి.జె. మరకేయర్ కుమారుడు షేక్ సలీం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో నిన్న బీజేపీలో చేరారు. తన చిన్నాన్న కలాం ఆశయసాధన కోసమే తను బీజేపీలో చేరుతున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశాన్ని అభివృద్ధి పధంలో నడిపిస్తున్నారని, ఆయన చేపడుతున్న విన్నూత్నమయిన అభివృద్ధి, సంక్షేమ పధకాలను చూసి ఆకర్షితుడనయ్యి బీజేపీలో చేరుతున్నట్లు షేక్ సలీం తెలిపారు. సమాజసేవా కార్యక్రమాలు చేస్తున్న షేక్ సలీం గత ఏడాదే రాజకీయాలలోకి ప్రవేశించాలనుకొన్నారు కానీ వీలుకుదరక జేరలేదు. వచ్చే ఏడాది జరుగబోయే తమిళనాడు శాసనసభ ఎన్నికలలో తనకు టికెట్ ఇచ్చినట్లయితే బీజేపీ తరపున పోటీ చేయాలనుకొంటున్నట్లు సలీం తెలిపారు. డిల్లీ రాజాజీ రోడ్డులో ఉన్న అబ్దుల్ కలాం అధికారిక నివాసంలో ఆయనతో బాటే సలీం కూడా ఉండేవారు. ఆ సమయంలోనే సలీంకి డిల్లీ (తూర్పు నియోజకవర్గం) ఎంపీ గిరీష్ తో పరిచయమయింది. ఆయన ద్వారానే సలీం బీజేపీలో చేరారు.