ఏపీలో దోచుకున్నవాడికి దోచుకున్నంతగా సాగిన రాజ్యంలో దొంగతనాలన్నీ బయటపడుతున్నాయి. అందులో ఒకటి రాక్రీట్ అనే కంపెనీ ఘన కార్యం. ఈ సంస్థ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి చెందినది. జగనన్న సెంట్ స్థలాల్లో ఇళ్లు కట్టిస్తామని చెప్పి అడ్వాన్సులు తీసుకుని పత్తా లేకుండా పోయింది. ఇలా కడతామని చెప్పి కాంట్రాక్ట్ తీసుకున్న వాటిలో పులివెందుల లే ఔట్ వ్యవహారం కూడా ఉంది.
పులివెందుల పురపాలక పరిధిలోని ఏపీఐఐసీ. భూముల్లో 6,739 ఇళ్లు మంజూరు చేయగా, చాలా వరకు పునాదులు కూడా వేయలేదు. మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. రాక్రీట్ సంస్థ అత్యధిక ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. కొన్ని ఇళ్లు గోడల వరకు.. అత్యధికం పునాదుల వరకే నిర్మాణాలు జరిగాయి. క్క ఇంటిని సైతం పూర్తి చేయలేదు . కానీ బిల్లులు మాత్రం వందల కోట్లలో చెల్లించారు. టెండరు ప్రక్రియ, ఎలాంటి ఒప్పందం లేకుండా పనులు చేశారు.
తోపుదుర్తి సంస్థ ఖాతాకు నేరుగా బిల్లులు చెల్లించే విధంగా ఉన్నత స్థాయిలో ఓ ప్రైవేటు బ్యాంకు ద్వారా చెల్లింపులు జరిగేలా ఏర్పాట్లు చేసుకున్నారు. దాదాపు 200 కోట్లు మేర వెచ్చించినా నిర్మా ణాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఇందులో పెద్ద స్కాం ఉందని తేలడంతో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి సీఎంను కలిసి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు వెంటనే విచారణకు ఆదేశించారు. ఎవరు డబ్బులు రిలీజ్ చేయమని ఆదేశించారో బయటకు తీగ లాగితే.. జగన్ దగ్గరకే చేరుతుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
రాక్రీట్ సంస్థ ఒక్క పులివెందులోనే కాదు.. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనూ ఇలాంటి కాంట్రాక్టులు తీసుకుని ఇళ్లు కట్టకుండా బిల్లులు పిండుకుంది. ఆ గుట్టంతా బయటకు వస్తే అతి పెద్ద స్కామ్ గా బయటపడే అవకాశం ఉంది.