జగన్ స్కాములు రోజాకు చెమటలు !

జగన్ హయాంలో టూరిజం పేరుతో భయంకరమైన దోపిడీ జరిగింది. తవ్వేకొద్దీ బయటకు వస్తున్నాయి. అందరికీ టూరిజం పేరుతో జరిగిన రుషికొండ ప్యాలెస్ స్కామే కనిపిస్తోంది కానీ అడుగడుగునా దోపిడీనే జరిగింది. ఇవన్నీ ఆ శాఖ మంత్రి రోజాకు తెలుసో లేదో ఎవరికీ తెలియదు. ఎందుకంటే వైసీపీ హయాంలో మంత్రులకు ఎలాంటి స్వేచ్చ లేదు. రోజాకు తిరుమల దర్శనం టిక్కెట్ల సంగతి చూసుకోమని చెప్పి.. ఇతర వ్యవహారాలన్నీ తామే నడిపారు.

తాజాగా పులివెందులలో ఓ వైసీపీ నాయకుడు కట్టి మధ్యలో వదిలేసిన భవనాన్ని ఫోర్ స్టార్ హోటల్ పేరుతో కొనేశారు. దాదాపుగా పదిహేను కోట్లు చెల్లించేశారు. అసలు టూరిజం రిసార్టులకు మరమ్మతులకు కూడా డబ్బుల్లేవని గగ్గోలు పెడుతూంటారు.కానీ ఈ లావాదేవీ ఎప్పుడు పూర్తి చేశారో ఎవరికీ తెలియదు. కానీ అయిపోయింది. ఉన్నతాధికారుల సంతకాలు కూడా ఉన్నాయి. పులివెందులలో సగం కట్టిన బిల్డింగ్ ను పదిహేను కోట్ల వరకూ పెట్టి కొనడం ఏందో..దాన్ని ఫోరో స్టార్ హోటల్‌గా చెప్పడం ఏమిటో ఎవరికీ అర్థం కాని విషయం.

దీని లెక్కలు కూడా బయటకు తీస్తున్నారు. వైసీపీ నాయకుడికి డబ్బుల చెల్లించి అందులో ఎవరు కమిషన్లు తీసుకున్నారో బయటకు తీస్తున్నారు . అయితే అధికారికంగా మాత్రం.. ఈ వ్యవహారం రోజా మెడకే చెట్టుకుంటుంది. ఎందుకంటే ఆమె పర్యాటక మంత్రి. పర్యాటక శాఖలో తవ్వేకొద్దీ ఎన్నో ఘోరాలు ఉన్నాయని.. మంత్రి కందుల దుర్గేష్ చెబుతున్నారు. వీటిపై చిరంజీవి, పవన్ కల్యాణ్ జోక్యం చేసుకోవాలంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారి లడ్డూ ఇష్యూ : వైసీపీ పాపం పండింది !

గుడిని గుడిలో లింగాన్ని మింగే బ్యాచ్‌కు ప్రజలు తిరుగులేని మెజార్టీతో అధికారం ఇస్తే.. తమకు దోచుకోమని లైసెన్స్ ఇచ్చారని ఫీలవుతారు. వైసీపీ నేతలు అదే ఫీలయ్యారు. దేవుడనే భయం కూడా...

కంగనపై దానం కామెంట్స్‌ – కేటీఆర్ ఖండన !

సినిమాల్లో బోగం వేషాలు వేసుకునే కంగనా.. రాహల్ గాంధీని విమర్శించడమా ?... అని దానం నాగేందర్.. హీరోయిన్ కంగనపై విరుచుకుపడ్డారు. ఈ బోగం వేషాలు అంటే ఏమిటో కానీ.. బీజేపీ నేతలకు...

తిరుపతి లడ్డూ ఇష్యూ : అడ్డంగా దొరికినా అదే ఎదురుదాడి !

వైసీపీ సిగ్గులేని రాజకీయాలు చేస్తుంది. అడ్డంగా దొరికిన తర్వాత కూడా ఎదురుదాడి చేసేందుకు ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో నాణ్యత లేని నెయ్యిని.. పశువుల కొవ్వుతో కల్తీ...

తిరుప‌తి ల‌డ్డు చుట్టూ వివాదం… ఇంత‌కు ఈ ల‌డ్డూ ఎందుకింత స్పెష‌ల్?

తిరుప‌తి ల‌డ్డూ. తిరుమ‌ల‌లో శ్రీ‌వారి వెంక‌న్న ద‌ర్శ‌నాన్ని ఎంత మ‌హాభాగ్యంగా భావిస్తారో... తిరుప‌తి ల‌డ్డూను అంతే మ‌హాభాగ్యంగా భావిస్తారు. ఉత్త‌రాది, ద‌క్షిణాది అన్న తేడా ఉండ‌దు... ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అన్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close