హైదరాబాద్‌లో మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ కార్యక్రమం జరిగేలా కేటీఆర్ ఒప్పందం చేసుకున్నారు. లండన్, న్యూయార్క్ వంటి సిటీ రోడ్లపై పరుగులు తీసిన ఫార్ములా ఎలక్ట్రిక్ కార్లు త్వరలో హైదరాబాద్ రోడ్లపై రేస్‌లో పాల్గొననున్నాయి. ఫార్మలా వన్ తరహాలో.. ఎలక్ట్రిక్ కార్లతో ఫార్ములా -ఈ రేసులు నిర్వహిస్తున్నారు. వీటిని హైదరాబాద్‌లో నిర్వహించేలా తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
ఫార్ముల వన్ రేసింగ్ నిర్వహించాలంటే ప్రత్యేకంగా ట్రాక్ అవసరం. కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్‌తో నిర్వహించే పోటీలకు ప్రత్యేక రేసింగ్ ట్రాక్ అక్కర్లేదు. హైదరాబాద్‌లో ఉన్న రోడ్లు సరిపోతాయి. ఫార్ములా ఈ నిర్వాహకులు రోడ్లను పరిశీలించి అంగీకారం తెలిపారు. కొన్ని సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. వాటికి ప్రభుత్వం తరపున కల్పిస్తారు. ఇ- వన్ ఫార్ములా ఛాంపియన్షిప్ పోటీలు ఇప్పటి వరకు లండన్, న్యూయార్క్, మెక్సికో, రోమ్, బెర్లిన్, రోమ్, సియోల్, వాంకోవర్ వంటి నగరాల్లో జరిగాయి. త్వరలో సౌదీ అరేబియాలోని దిరియా నగరంలో జరగనున్నాయి.., తర్వాత హైదరాబాద్‌లో జరుగుతాయి.
ఇ వన్ ఫార్ములా పోటీలు నిర్వహించేందుకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చొరవ చూపించారు. రేస్‌కి ఆతిధ్యం ఇచ్చేందుకు ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి మెట్రో నగరాలు సైతం పోటీ పడ్డాయి. కేటీఆర్ ప్రభుత్వం తరపున చురుకుగా వ్యవహరించి హైదరాబాద్‌కు తీసుకు రావడంలో సక్సెస్ అయ్యారు.