‘నో’ చెప్పడం తెలియాలి అన్నది సినిమాల్లో ఓ కీలక పాఠం. వచ్చిన ప్రతీ అవకాశానికీ తలాడించకుండా…. మంచివే ఎంచుకోవడంలో నైపుణ్యం ఉండాలి. అది బన్నీకి కావల్సినంత ఉంది. బన్నీ కెరీర్లో ఫ్లాపులు ఉండొచ్చు. కానీ.. ‘నో’ చెప్పిన సినిమా మాత్రం హిట్టయిన దాఖలా లేదు. అదీ.. బన్నీ జడ్జిమెంట్! ఇటీవల సందీప్ కిషన్ నటించిన ‘ఒక్క అమ్మాయి తప్ప’ కథ ముందు బన్నీకే వినిపించారు. ”ఇది వర్కవుట్ అయ్యే ఛాన్సే లేదు” అన్నది బన్నీ మాట. ”చిన్న బడ్జెట్లో తీసుకోండి..” అని ఆ దర్శకుడికి సలహా కూడా ఇచ్చాడట. అనుకొన్నట్టే ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. అంతకుముందు సునీల్ తో దిల్‌రాజు చేసిన ‘కృష్ణాష్టమి’ కూడా బన్నీ చేయాల్సిన సినిమానే. ఆ స్క్రిప్టు పట్టుకొని బన్నీ వెంట తెగ తిరిగాడు దిల్‌రాజు. కానీ బన్నీ కనీసం మొహమాటానికి కూడా ఓకే చెప్పలేదు. చివరికి అది సునీల్‌కి చిక్కింది… ఫ్లాప్ అయ్యింది.
నాగచైతన్య చేసిన ఒక లైలా కోసం సినిమా కూడా ముందు బన్నీకే వినిపించారట. దాన్నీ ఒప్పుకోలేకపోయాడు బన్నీ. ఆటోనగర్ సూర్యకూడా ముందు బన్నీ దగ్గరకు వెళ్లిందని, కానీ బన్నీ.. ఆ కథని సింపుల్ గా రిజెక్ట్ చేశాడని టాక్. అలా… బన్నీ వదులుకొన్న నాలుగు సినిమాలూ ఫ్లాపులే అయ్యాయి. ఒకవేళ యస్ అనుంటే.. బన్నీ కెరీర్ ఈపాటికి వరుస ఫ్లాపులతో ఖతమైపోయేది.