తిరుమల నెయ్యి కల్తీని దర్యాప్తు చేస్తున్న సుప్రీంకోర్టు నియమించిన దర్యాప్తు బృందం నలుగుర్ని అరెస్టు చేసింది. AR డైరీ ఏండీ రాజశేఖరన్ తో పాటు ఉత్తర ప్రదేశ్ కు చెందిన విపిన్ గుప్త, పోమిల్ జైన్, అపూర్వ చావ్డాలను అరెస్టుచేశారు. తిరుపతిలో మకాం వేసి దర్యాప్తు వేగవంతం చేసిన సీబీఐ జాయింట్ డైరెక్టర్ విరేష్ ప్రభు నెయ్యి కల్తీని గుర్తించారు. నిందితుల్ని అరెస్టు చేశారు. వీరిని తిరుపతి కోర్డులో హాజరు పర్చనున్నారు. ఏ ఆర్ డెయిరీ.. తిరుపతిలోని వైష్ణవి డైరీ వ్యవహారాలు అత్యంత కీలకంగా మారాయి. త్వరలో మరికొన్ని అరెస్టులు ఉండే్ అవకాశం ఉంది.
తిరుమలలో నెయ్యి కల్తీ జరగలేదని వాదిస్తున్న వారికి సుప్రీంకోర్టు నయమించిన దర్యాప్తు బృందం అరెస్టులు మింగుడు పడనివే అనుకోచ్చు. ఈ సిట్ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నెయ్యిని కల్తీ చేసి అమ్మడానికి పెద్ద నెట్ వర్క్ ఉందని గుర్తించారు. ఈ నెట్ వర్క్ లో అసలు లబ్దిదారులు ఎవరో.. ఆ నెయ్యి కమిషన్లు ఎవరి ఖాతాలోకి వెళ్తాయో కూడా తేల్చనున్నారు. వైవీ సుబ్బారెడ్డి తో పాటు.. భూమన కరుణాకర్ రెడ్డి ఈ వ్యవహారలో కీలక పాత్ర పోషించారు.
నెయ్యి సరఫరా టెండర్లు దక్కిచుకున్న కంపెనీలకు అంత సామర్థ్యంలో నెయ్యి సరఫరా చేసే అవకాశం లేదని.. అంతా కల్తీ చేసి శ్రీవారి ప్రసాద్ తయారీకీ సరఫరా చేశారని సీబీఐ సిట్ తేల్చడంతో.. ఆ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించనుంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారాన్ని చంద్రబాబు బయట పెట్టిన తర్వాత రాజకీయ సంచలనం రేగింది. అసలు కల్తీనే జరగలేదని వైసీపీ నేతలు వాదించారు. కానీ అసలు దొంగలు.. దేవుడికి ద్రోహం చేసిన దొంగలు దొరికారు. సూత్రధారుల్ని కూడా పట్టుకోబోతున్నారు.