పులివెందుంలలో అవినాష్ రెడ్డి బావ, వైసీపీ లీడర్ ఓ వెంచర్ వేసి బిల్డింగ్ కడుతున్నారు. అది ఎకరంన్నర స్థలంలో ఉంటుంది. గట్టిగా అయితే స్థలం విలువతో పాటు… వేసిన పిల్లర్లు, శ్లాబ్ ఖర్చు రెండు కోట్లు కూడా చేయదు. ఇంకా చెప్పాలంటే ఆ ఏరియాలో అసలు కొనేవాళ్లు కాదు కదా.. అద్దెకు వచ్చే వాళ్లు కూడా ఉండరు. ఆ విషయం వాళ్లకూ తెలుసు. కానీ కొనేందుకు మన ప్రభుత్వం ఉంది కదా అని రంగంలోకి దిగిపోయారు.
వెంటనే కలెక్టర్ పులివెందులలో అద్భుతమైన ఫోర్ స్టార్ హోటల్ కట్టేందుకు సగం కట్టిన భవనం రెండున్నర ఎకరాల్లో ఉందని కొనేయాలని టూరిజానికి రిక్వెస్ట్ పెట్టారు. వెంటనే కొనాలని సీఎంవో నుంచి ఒత్తిళ్లు వచ్చాయి. టూరిజం అధికారులు ఏకంగా పన్నెండున్నర కోట్లు ఇచ్చి కొనేశారు. ఈ దెబ్బతో ప్రజాధనం పది కోట్లకుపైగా అవినాష్ రెడ్డి బావ ఖాతాలో పడిపోయింది. కామెడీ ఏమిటంటే… అక్కడ ఆ భవనం ఉంది ఎకరంన్నర స్థలంలో అయితే కలెక్టర్ రెండున్నర ఎకరాల్లో ఉందని కొనేయాలని చెప్పడం. అయితే కొనుగోలు సమయంలో అంత స్థలం లేకపోవడంతో ఉన్న స్థలాన్నే కొన్నారు.
ప్రజాధనం ఇంత ఈజీగా కోట్లకు కోట్లు ఎలా కొట్టేశారో ఇప్పటికీ చాలా మంది ఆశ్చర్యకరంగానే ఉంది. ప్రజలు పన్నులరూపంలో కట్టే సొమ్మును సొంత ఖాతాలకు ఇంత అడ్డగోలుగా మల్చుకున్నారంటే.. బయటపడేవి ఇంకెంత ఘోరంగా ఉంటాయోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు అధికారం ఇస్తే.. ఇక ఖజానా అంతా తమ సొత్తు అన్నట్లుగా వ్యవహరించిన వారికి మరోసారి ఎవరూ అలా చేయని విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.