పోలీసులు రాళ్లతో కొట్టారు. పెల్లట్లు ప్రయోగించారు. స్మోక్ బాంబులు వేశారు. లాఠీలు ఝుళింపించారు.. టియర్ గ్యాసులు ప్రయోగించారు. కానీ ఒక్క రంటే.. ఒక్క రైతు వెన్ను చూపలేదు. ముందుకే కదిలారు. రైతులు, రైతు కుుంబాలు… ప్రభుత్వం ఎంత దమన కాండ చేస్తే.. అంతకు రెట్టించిన పోరాటబలంతో ముందుకు పోయారు. ఇంటిలో మగదిక్కుపై కేసులు పెట్టి జైుకు పంపితే ఆడవాళ్లు బయటకు వచ్చారు. ఉద్యమాన్ని నెత్తికెత్తుకున్నారు. వారిపైనా పోలీసు జులుం చూపించారు. గుడికి వెళ్తమంటే అడ్డుకుని లాఠీ చార్జ్ చాశారు. ఎస్సీలపైనే అట్రాసిటీ కేసులు పెట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే..అమరావతి రైతలు పోరాటంలో ఎదుర్కొన్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు.
అవ్నీ గుర్తు చేసుకుంటే.. అమ్మో అని అనుకుంటాం. జగన్ రెడ్డి రాష్ట్రాన్ని దక్షిణాఫ్రికా చేస్తానని ప్రకటించి నాలుగేళ్లు అయింది. కానీ నైజీరియా చేసేశారు. ఎక్కడ చూసినా అరాచకమే రాజ్యమేలుతోంది. రాష్ట్ర రాజధాని కోసం ఉదాత్తంగా ఆలోచించి రైతులు భూమి ఇచ్చారని సర్వనాశనం చేయాలనుకున్నారు జగన్ రెడ్డి. అసెంబ్లీలో అంగీకరించి..ఎన్నికల్లో గెలిచే దాకా అమరావతే రాజధాని.. చంద్రబాబు వేగంగా కట్టలేకపోయాడు..నేనైతే చిటికెలే కట్టేస్తానని నమ్మించాడు. చివరికి స్మశానం చేయాలనుకున్నారు. కానీ రైతులు ఎదురొడ్డి నిలబడ్డారు. ఓ వైపు ప్రజా ఉద్యమం చేస్తూ మరో వైపు న్యాయపోరాటం చేస్తూ.. తాను పట్టిన కుందేలుకు మూడేళ్లు అనుకునే.. క్రిమినల్ మైండ్ ఉన్న పాలకుడిపై పోరాడారు. అతని చేతిలో ఉన్న వ్యవస్థలు అతనిలాగే సైకో మనస్థత్వంతో వ్యవహరించినా భరించారు.
రైతుల పోరాటంలో ఎతో మంది ప్రాణాలు కోల్పోయారుు. మనో వేదనతో ఆరోగ్యోలు కోల్పోయి వేతన పడ్డారు. అయినా ఎక్కడా పట్టువదల్లేదు. ఇప్పటికీ.. అమరావతి ఉద్యమం అంటే ఎంత భయం ఉంటుందంటే.. నిరసన శిబిరంలో ఒక్క రైతు ఉంటే.. పాతిక మంది పోలీసుల్ని అడ్డుపెట్టుకునేంత భయం ఉంది. అమరావతి రైతుల పోరాటంలో నిజాయితీ ఉంది. మాట తప్పిన పాలకుడి వ్యవహారంలో దుర్నీతి ఉంది. అందుకే.. పోరాటంలో ఎప్పటికప్పుడు అమరావతి రైతులే విజయం సాధిస్తున్నారు. అది ఉద్యమం అయినా.. న్యాయస్థానం అయినా సరే.
ఏదైనా సింపుల్గా జరిగితే అది అద్భుతం అయినా గుర్తింపు రాలేదు. కానీ ఓ సంఘర్షణ తర్వాత అది సాకారం అయితే చరిత్రలో నిలిచిపోతుంది. అద్భుతమైన అమరావతి కూడా అంతే. సాఫీగా ప్రారంభమైనా.. సంఘర్షణ మాత్రం తప్పలేదు. పీక నొక్కాలనుకున్నా.. తేరుకుని నిలబడుతుంది. ప్రపంచంలో అమరావతికి ప్రత్యేక గుుర్తింపు రైతుల పోరాటం వల్ల వస్తోంది.