తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫోర్త్ సిటీ ప్రధానంగా మూడు గ్రామాల్లో కేంద్రీకృతం అయి ఉంటుంది. ఈ గ్రామల్లో ఒకటి బేగరి కంచె. ఇటీవల స్కిల్ యూనివర్శిటీకి శంకుస్థాపన చేసినప్పుడు బెగరికంచ ప్రాంతాన్ని ఫోర్త్ సిటీగా తమ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బంజారాహిల్స్‌లో నివసించే ప్రజల మాదిరిగా.. బెగరికంచలో నివసించేవాళ్లు కూడా గొప్పలు చెప్పుకునే విధంగా ఈ నాలుగో సిటీని తీర్చిదిద్దుతామని ప్రకటించారు. బెగరికంచె సిటీకి విదేశాల నుంచి రూ.వేల కోట్ల పెట్టబడులు తెచ్చి హెల్త్, స్పోర్ట్, ఇతర కంపెనీలకు హబ్‌గా మారుస్తామన్నారు.
ఫోర్త్ సిటీకి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత చూసిన తర్వాత ఎవరికైనా అక్కడ పెట్టుబడి పెడితే భవిష్యత్ లో ఏ స్థాయిలో రిటర్న్స్ వస్తాయో అంచనా వేయడం పెద్ద కష్టమేం కాదు. బేగరి కంచె చుట్టుపక్కల ఇప్పుడు భూమి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఫోర్త్ సిటీ ప్రకటించిన తర్వాత సహజంగానేపెరుగుతూ పోతున్నాయి. ప్రైవేటు రియల్ ఎస్టేట్ సంస్థలు సేకరించిన భూమిని ప్లాట్లుగా వేసి అమ్ముతున్నారు. అయితే బేగరి కంచె అని చెబుతున్నారు కానీ.. ఆ సమీపంలో అమ్మకానికి .. కొనుగోలుకు భూములు తక్కువే. కానీ యాచారం వరకూ డిమాండ్ కనిపిస్తోంది.
ఇప్పటికే ఫోర్త్ సిటీ పేరుతో వచ్చే నాలుగైదేళ్ల కాలంలో పెరిగే రేట్లను ఇప్పుడే పెంచి అమ్ముతున్నారు. ఎకరానికి ఆరేడుకోట్ల వరకూ బేరం పెడుతున్నారు. కాస్తదూరంగానే ఈ ధరలు ఉన్నాయి. మరీ ఫోర్త్ సిటీకి దగ్గరగా కాకుండా..కాస్త దూరంగా స్థలాలు కొనుగోలు చేయాలంటే చాలా వెంచర్లు అందుబాటులో ఉన్నాయి. అందులో కూడా గజం ఇరవై వేల వరకూ చెబుతున్నారు. ఫోర్త్ సిటీలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇది మంచి చాన్స్ . అయితే ముందుగా వెళ్లి.. పరిశీలన చేసుకుని.. ఫోర్త్ సిటీ ఐదేళ్లలో కాపోయినా పదేళ్లలో అభివృద్ధి జరిగినాఎదురుచూడగలమనుకునే వారు పెట్టుబడి పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.