ఫాక్స్ కాన్ ప్లాంట్ ఎక్కడ పెట్టాలనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోకుండానే కొన్ని ప్రభుత్వాలు ప్రకటించుకున్నట్లుగా ఇంగ్లిష్ మీడియా రిపోర్ట్ చేయండతో గందరగోళం ఏర్పడింది. అంతకు ముందే..తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఫాక్స్ కాన్ ప్లాంట్ తెలంగాణలో పెడుతున్నారని ప్రకటించింది. ఈ గందరగోళం గురించితెలియగానే.. ఫాక్స్‌కాన్ పరిశ్రమను కొంగరకలాన్‌లో ఏర్పాటు చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఫాక్స్‌కాన్ ఛైర్మన్ తాజాగా సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. వీలైనంత త్వరగా తాము కార్యకలాపాలు నిర్వహించుకొనేందుకు ప్రభుత్వం నుంచి సాయం కావాలని కోరారు. అంతేకాక, తైవాన్‌లో పర్యటించాలని యాంగ్ లియూ కేసీఆర్‌ను ఆహ్వానించారు.
మార్చి రెండో తేదీన ఫాక్స్‌కాన్ చైర్మెన్ యంగ్ లియూ.. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. హైదరాబాద్‌లో తమ టీమ్ విజిట్ చేసినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆతిథ్యానికి ఫాక్స్ కాన్ చైర్మన్ లేఖలో థ్యాంక్స్ తెలిపారు. హైదరాబాద్‌లో బస చేసిన సమయం అద్భుతంగా సాగిందన్నారు. ఇండియాలో తనకు ఓ కొత్త ఫ్రెండ్ దొరికినట్లు లియూ తన లేఖలో చెప్పారు. భవిష్యత్తులోనూ కేసీఆర్‌తో కలిసి పనిచేసేందకు ఉత్సాహాంగా ఉన్నట్లు తెలిపారు.
మార్చి 2వ తేదీన చర్చించినట్లే.. కొంగర కలాన్‌లో ఫాక్స్‌కాన్‌ను ఏర్పాటు చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని చైర్మెన్ లియూ తన లేఖలో తెలిపారు. వీలైనంత త్వరగా మాన్యుఫ్యాక్చరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు మీ టీమ్ సహకారాన్ని కోరనున్నట్లు చెప్పారు. కొంగరకలాన్‌లో ఏర్పాటు చేయబోయే ఫ్యాక్టరీ వల్ల లక్ష ఉద్యోగాలు కల్పించనున్నట్లు ఆ కంపెనీ తెలిపింది. ఈ కంపెనీకి 250 ఎకరాలు అవసరం కాగా.. ఇప్పటికే సర్వే నం.300లో 187 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వ కేటాయించింది. ఇందుకుగాను రెవెన్యూ అధికారులు, టీఎస్ఐఐసీ అధికారులు రెండు మూడు నెలలుగా సర్వే చేసి భూమిని సిద్ధంగా ఉంచారు. మిగతా భూమిని త్వరలోనే సేకరిస్తామని తెలిపారు.