సీఎం చంద్రబాబు దూకుడు పెంచుతున్నారు. ఏపీలో మరోసారి జగన్ అనే మాటే వినపడకుండా… పక్కాగా, ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నారు. జగన్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలను పక్కనపెట్టడం, పారదర్శకంగా సాగే తనదైన మార్క్ పాలనను స్పీడప్ చేస్తున్నారు.
జగన్ అధికారంలో ఉన్న సమయంలో తీవ్రంగా ఇబ్బందిపడ్డ నిర్మాణరంగాన్ని చంద్రబాబు గాడిన పెట్టబోతున్నారు. ఉచితంగా వచ్చే ఇసుకను రేట్లు పెంచి, కృత్రిమ కొరత సృష్టించి, పక్క రాష్ట్రాలకు తరలించి ఇష్టానుసారంగా వైసీపీ దోచుకుంది. సహజ సంపదను తమ సంపదగా మల్చుకుంది. దీంతో రేట్లు పెరిగి, రియల్ ఎస్టేట్ తగ్గి… నిర్మాణరంగం కుదేలైంది. చాలా మంది పక్క రాష్ట్రాలకు వలస వెళ్లిపోయారు.
చంద్రబాబు అధికారంలోకి రాగానే రియల్ రంగానికి ఊపొచ్చింది. దానికి తోడు ఇప్పుడు మరోసారి ఉచితంగా ఇసుక అందించే పథకాన్ని తీసుకొస్తున్నారు. గతంలో ఉన్నట్లుగానే రాష్ట్రంలో సొంతింటి నిర్మాణానికి ఉచితంగానే ఇసుక ఇవ్వబోతున్నారు. ఈ నెల 8 నుండి ఇది స్టార్ట్ చేయబోతున్నారు. లోడింగ్, రావాణా చార్జీలను కలెక్టర్లు డిసైడ్ చేస్తారు.
పెన్షనర్ల విషయంలో ఉన్న సందేహాలను పటాపంచలు చేస్తూ చంద్రబాబు పెరిగిన పెన్షన్లు ఒకటో తేదీనే అందించారు. ఇప్పుడు జగన్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్న నిర్మాణ రంగంలో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. సంక్షేమానికి అభివృద్ధి తోడు చేస్తానన్న మాటను నిలబెట్టుకుంటూ చంద్రబాబు సాగుతుండగా… ఇదే స్పీడ్, వ్యూహాలు కొనసాగితే జనం జగన్ ను గుర్తు కూడా చేయరన్న అభిప్రాయం వినిపిస్తోంది.