ఏపీ ప్రజలకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 2019, 2021 సంవత్సరాల్లో ఇచ్చిన ఇసుక పాలసీలను రద్దు చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే, కలెక్టర్లకు ప్రత్యేకంగా విధివిధానాలు 2024వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.
ఇప్పటికే ఫ్రీగా ఇసుక సరఫరా చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం అందుకు అనుగణంగా చర్యలు చేపట్టింది. సోమవారం నుండే ఆయా జిల్లాల పరిధిలో ఉన్న స్టాక్ పాయింట్స్ వద్ద ఉచిత ఇసుక పథకాన్ని మంత్రులు మొదలుపెట్టారు. ప్రభుత్వ స్టాక్ పాయింట్స్ వద్ద 49లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉంది.
కొత్త ఇసుక పాలసీ తీసుకొచ్చే వరకు జిల్లా కలెక్టర్ చైర్మన్ గా ఎస్పీ, ఇతర అధికారులు కమిటీలో ఉంటారు. ఈ కమిటీ ఫైనల్ చేసిన విధంగా ఇసుకను సరఫరా చేస్తారు.
ఫ్రీగా ఇచ్చే ఇసుకను గృహనిర్మాణ అవసరాలకు తప్పా ఇతర అవసరాలకు వాడకూడదని సర్కార్ పేర్కొంది. ఇసుక సరఫరాకు అయ్యే ఖర్చును మాత్రమే ప్రభుత్వం వసూలు చేయబోతుంది. ప్రతి కి.మీకు 4.90పైసలు చార్జీ వసూలు చేయబోతున్నారు. ఇది కూడా పూర్తిగా ఆన్ లైన్ లో చెల్లింపులు చేసేలా ఏర్పాట్లు చేశారు.