హైదరాబాద్: ఇది నిజంగా దేశానికే గర్వకారణమైన విషయం. ఒక భారతీయ కంపెనీ కారుచవకగా, రు.251లకే స్మార్ట్ ఫోన్‌ను అందిస్తోంది. ఇంత చవకగా స్మార్ట్ ఫోన్ లభిస్తే భారత్‌లో ‘డిజిటల్ డివైడ్’ అనే అంతరం త్వరలోనే మాయమవుతుందని చెప్పాలి. ఉత్తరప్రదేశ్‌లోని నొయిడాకు చెందిన రింగింగ్ బెల్స్ అనే సంస్థ(http://freedom251.com/) ఈ ఫోన్లను తయారు చేస్తోంది. రేపు – 18.02.16 – ఉదయం 6 గంటలనుంచి బుకింగ్‌లను ఓపెన్ చేయనుంది. ఈ ఫోన్‌ను ఇవాళ సాయంత్రం రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ఢిల్లీలో జరిగే ఓ కార్యక్రమంలో లాంఛనంగా విడుదల చేస్తారు. మరి ఇది సమర్థవంతంగా పనిచేస్తుందో తెలియటానికి కొద్దిరోజులు ఆగాలి. దీని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ మాత్రం రు.5,000 రేటున్న స్మార్ట్ ఫోన్లతో సమానంగా ఉండటం విశేషం.
- ఫ్రీడమ్ 251గా పిలుస్తున్న ఈ ఫోన్ ఆండ్రాయిడ్ లాలీపాప్ 5.1 ఓఎస్‌తో నడుస్తుంది.
- దీనిలో 1.3 గిగా హెర్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఉంది.
- 3జీ సిమ్‌లను కూడా వేసుకోవచ్చు.
- స్క్రీన్ డిస్ ప్లే 4 అంగుళాలు ఉంది.
- 1 జీబీ ర్యామ్ ఉంది.
- 8 జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంది… 32 జీబీ దాకా పెంచుకోవచ్చు.
- వెనకవైపు 3.2 మెగాపిక్సెల్ కెమేరా, ముందువైపు 0.3 మెగా పిక్సెల్ కెమేరా ఉన్నాయి.
- 1,450 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.
- 1 సంవత్సరం వారంటీ ఉంది