టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన జగన్ రెడ్డి అభిమానస్తులను పోలీసులు అరెస్టు చేయడం ప్రారంభించారు. మూడు రోజులుగా సీసీ టీవీ ఫుటేజీని సేకరించి… మొత్తం దాడుల్లో పాల్గొన్న వారి వివరాలను రెడీ చేసుకుని అర్థరాత్రి నుంచి వారిని అరెస్టులు చేయడం ప్రారంభించారు. కొంత మందికి మందుస్తుగా సమాచారం రావడంతో పారిపోయారు . ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దొరికిన వారిని దొరికినట్లుగాఅరెస్టు చేస్తున్నారు. గుంటూరుకు చెందిన వారినే ఎక్కువగాఅరెస్టు చేస్తున్నారు.
మూడేళ్ల కిందట జగన్ను ఏదో అన్నారని చెప్పి టీడీపీ ప్రధాన కార్యాలయంపై వైసీపీ మూకలు దాడి చేశార. దేవినేని అవినాష్ , లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డిల నేతృత్వంలో వారి ముఖ్య అనుచరులు ఈ దాడికి పాల్పడ్డారు. ముందే తెలిసిన పోలీసులు …దాడి జరిగే వరకూ ఆ వైపు కూడా కూడా రాలేదు. టీడీపీ ఆఫీసులో విధ్వంసం చేస్తూ ఓ ఎస్ఐ దొరికాడు కూడా. టీడీపీపై దాడి ఘటనలో సాదాసీదా కేసులు పెట్టారు. కనీస విచారణ చేయలేదు. నిందితుల్ని పట్టుకోలేదు. కానీ సీసీ ఫుటేజీలో నిందితులు అడ్డంగా దొరికిపోయారు.
ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం రావడంతో ఆ కేసులో కదలిక వచ్చింది. ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటయింది. వారు టీడీపీ ఆఫీసుకు వచ్చి సీసీ ఫుటేజీ తీసుకుని నిందితుల్ని గుర్తించి అరెస్టులు ప్రారంభించారు. ఈ దాడి తాడేపల్లి ప్యాలెస్ డైరక్షన్ లో జరిగిందన్న అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు విచారణలో అసలు కోణాన్ని వెలుగులోకి తెచ్చే అవకాశం ఉంది. వారం రోజుల్లో టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.