ఇండియా నుంచి జెండా ఎత్తేయాలని నిర్ణయించుకున్న హోల్సిమ్ అనే సిమెంట్ గ్రూప్ తమ వాటాను అమ్మకానికి పెట్టింది. వెంటనే అదానీ… రూ. 80వేల కోట్లకుపైగా వెచ్చించి తాము కొనేస్తామని ముందుకు వచ్చారు. ఇంత పెద్ద మొత్తం పెట్టి రెండు సిమెంట్ కంపెనీలను కొంటారా అని ఇండస్ట్రీ కూడా ఆశ్చర్యపోతోంది. అయితే అదానీ ఇలాంటి ఆశ్చర్యలను గత ఎనిమిదేళ్ల కాలంల కాలంలో తరచూ చేస్తూనే ఉన్నారు. కనిపించిన ప్రతీ కంపెనీని ఆయన కొనుగోలు చేసేందుకు వెనుకాడటం లేదు. ఇప్పటికి ముఫ్పైకి పైగా కంపెనీలను ఆయన కొనుగోలు చేశారు.
అందులో ఏపీలోని గంగవరం .. కృష్ణపట్నం పోర్టుల్లాంటివి కూడా ఉన్నాయి. ఇక ఎయిర్ పోర్టుల గురించి చెప్పుకోవాలంటే చాంతాడంత అంత అవుతుంది. ఇప్పటికే అహ్మదాబాద్, తిరువనంతపురం, లక్నో, మంగళూరు, జైపూర్, గౌహతి, ముంబై వంటి విమానాశ్రయాలు అదానీ పరం అయ్యాయి. దేశీయ ఎయిర్ పోర్టు రంగంలో అదానీ గ్రూప్ వాటా 25శాతానికి చేరింది. దేశంలో అతిపెద్ద ఎయిర్ పోర్టు సంస్థగా అవతరించింది. ఇలాంటి టేకోవర్లు ఆయన విపరీతంగా చేసేస్తున్నారు. వీటన్నింటికీ అదానీ గ్రూప్ నిధులు ఎలా సమీకరిస్తుందన్నది మిస్టరీగా మారింది. ఎవరెవరో కష్టపడి వ్యాపారాలు నిర్మించుకోవడం.. అదానీ వాటిని సింపుల్‌గా టేకోవర్ చేయడం జరిగిపోతూ ఉంది. గ్రూప్‌లోని కంపెనీలు విదేశాల నుంచి పెద్ద ఎత్తున కంపెనీలు ఫండ్స్‌ను తరలిస్తున్నాయి.
ఇదంతా పెట్టుబడి రూపంలో జరుగుతోంది. నిధులు తరలిస్తున్న కంపెనీల సమాచారాన్ని అదాని గ్రూప్ రహస్యంగా ఉంచింది. నిబంధనల గతంలో పెట్టుబడు అంశంపై దుమారం రేగింది. అదాని గ్రూప్‌కు నిధులు మూడు విదేశీ కంపెనీల నుంచి వచ్చాయి. ఆ కంపెనీలకు మారిషస్‌లోని పోర్ట్‌లూయిస్‌కు చెందిన ఒకే అడ్రస్ ఉంది. వీటికి ప్రత్యేక వెబ్సైట్లు కూడా లేవు. అంటే బ్లాక్ మనీని ఇండియా నుంచి మారిషస్ తరలించి.. అక్కడ్నుంచి పెట్టుబడుల రూపంలో ఇండియాకు తరలించారన్న ఆరోపణలు వచ్చాయి.