విశాఖ ఎంపీగా ఉన్నప్పుడు ఎంవీవీ సత్యనారాయణ ఇంట్లోనే ఆయన భార్య, కుమారుడ్ని నిర్బంధించి ఆస్తులు రాయించుకున్న ముఠా వ్యవహారంలో అసలు నిజాలు ఎప్పుడూ బయటకు రాలేదు. నిందితులపై ఎలాంటి కేసులు పెట్టారో కూడా తెలియదు. అదంతా ఓ గూడుపుఠాణిలా సాగిపోయింది. సెటిల్మెంట్ లో భాగంగా జగన్ పత్రికకు రెండు ఫుల్ పేజీ యాడ్స్ కూడా ఇచ్చారని అంటున్నారు.
ఇప్పుడు ఈ కేసులో అసలైన దర్యాప్తు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పోలీసు వ్యవస్థ ను ప్రక్షాళన చేయబోతున్నారు. విశాఖకు కొత్త సీపీ రావడం ఖాయంగా కనిపిస్తోంది.ఆయన రాగానే అసలు సినిమా ప్రారంభమవుతుంది. ఎంవీవీ సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్ కారణాలు.. జగన్ పత్రికకు ప్రకటనల వరకూ ఏం జరిగిందో మొత్తం బయటకు తీసుకురానున్నారు.
నిజానికి ఈ కిడ్నాప్ వ్యవహారంలో ఏం జరిగిందో విశాఖలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రతి ఒక్కరికీ తెలుసు. లోతుగా ఆరా తీస్తే.. ఆ లింక్ తాడేపల్లి ప్యాలెస్ వరకూ వెళ్తుదంని కూడా తెలుసు. అందుకే ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకుని సంచలన విషయాలు బయటపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖలో జరిగిన అత్యంత ఘోరమైన దందాలు దీని ద్వారా వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.