అక్రమ సంబంధం ఎంతటి దారుణానికి దారితీస్తుందో, ఎంత గొప్ప జీవితాన్ని అంధకారనికి నెట్టేస్తుందో చెప్పే యదార్ధ సంఘటన ఇది. ఒక హీరో క్రూర విలన్ గా మారిపోయిన యదార్ధ సత్యం. ఆ హీరో ఎవరో కాదు.. మలయాళ స్టార్ దిలీప్.
నటి భావనను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసి లైగింక దాడికి పాల్పడిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాదాపు ఐదు నెలల క్రితం జరిగిన ఈ ఘటనపై పోలీసులు చేస్తున్న దర్యాప్తు కొలిక్కి వచ్చేసింది. సుదీర్ఘ విచారణల అనంతరం అనుమానితుడుగా ఉన్న హీరో దిలీప్‌ను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్ చేయడమే కాదు. ఈ దారుణం వెనుక వున్నది దిలీపే అని స్పష్టమైన ఆధారాలు సంపాదించేశారు. మూడు రోజులు.. రోజులో పన్నెండు గంటలు పాటు పోలీసులు తమదైన శైలిలో జరిపిన విచారణలో నిజాలు బయటికి వచ్చేశాయి.
పోలీసులు చెప్పిన వివరాలు ప్రకారం.. ఇది ఒక ”ఇల్లీగల్ రివెంజ్” స్టోరీ. దీలిప్ మొదటి భార్య మంజువారియర్. చాలా ఏళ్ల క్రితమే మంజును పెళ్లి చేసుకున్నాడు దిలీప్. అయితే మంజుతో పెళ్ళికి ముందే మరో హీరోయిన్ కావ్య మాధవన్ తో ఎవరికీ తెలియకుండా ఎఫైర్ నడిపాడు దిలీప్. పెళ్లి తర్వాత కూడా ఇది సాగింది. ఒక్క మాటలో చెప్పాలంటే కావ్య దిలీప్ కి సెకెండ్ సెటప్. అయితే బయట ప్రపంచానికి మాత్రం కేవలం మంచి స్నేహితులు గానే పరిచయం. భావన, దిలీప్ భార్య మంజు వారియర్ కి ఫ్రెండు. దిలీప్ వ్యవహరం భావనకు తెలిసింది. కావ్య దిలీప్ ల మధ్య వున్నది స్నేహం కాదని , అది అంతకుమించిన బంధమనే విషయం ఓ సందర్భంలో భావన కంట పడిందట. ఈ విషయం సరాసరి మంజుకు చెప్పేసింది భావన.
అప్పటి నుండి దిలీప్-మంజుల మధ్య గొడవలు మొదలయ్యాయి. చివరికి దిలీప్ కి విడాకులు ఇచ్చేసింది మంజు. విడాకుల ఎపిసోడ్ లో మంజు కంటే దిలీప్ చాలా ఇబ్బందిబడ్డాడట. ఇది తన ఇమేజ్ ను దెబ్బ తీస్తుందని మంజును బ్రతిమాలాడట. కాని మంజు విడాకులకే పట్టుబట్టింది. దీంతో మరో ఆప్షన్ లేక విడాకులు ఇచ్చాడు దిలీప్. తర్వాత కావ్యాను లీగల్ గా పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ కి కారణం భావనేనని, భావనే తన భార్యకు లేనిపోనిది నూరి పోసిందిని, విడాకుల సీన్ తెచ్చి తన ఇమేజ్ పై దెబ్బ పడేలా చేసిందని, ఎలాగైనా భావనపై ప్రతీకారం తీర్చుకోవాలని కత్తిగట్టాడు దిలీప్.
ఈ క్రమంలో పల్సర్ సునీని ఆశ్రయించాడు. తన రివెంజ్ ఏ రేంజు లో ఉండాలో చెప్పాడు. భావన ను నగ్నంగా చిత్రీకరించడం, కుదరకపోతే బలవంతం చేసి ఆ వీడియోలను నెట్ కెక్కించేయడం, దాని ద్వారా ఆమె జీవితాన్ని చిదిమేయడం.. ఇలా క్రూరమైన విలన్ ప్లాన్ గీసుకున్నాడు దిలీప్. 2013లోనే ఈ కుట్రకు బీజం పడిందట. మొదట భావనకు ఇండస్ట్రీ లో అవకాశాలు లేకుండా చేయడంపై ఫోకస్ చేశాడు దిలీప్. అందులో కొంతమేరకు విజయం సాధించాడు. అయితే అక్కడితో శాంతించలేదు. తనకు గీసుకున్న దారుణమైన రేప్ ప్లాన్ ను అమలు చేశాడు. దిలీప్ అనుకున్నట్లే భావనను కిడ్నాప్ చేసి కారులోనే ఆమెను లైంగికంగా హింసించి మార్గం మధ్యలో వదిలేసి పారిపోయారు దిలీప్ పురమాయించిన దుండగులు. వీడియోలు కూడా తీశారట. ఈ ఘటనతో భావన మానషికంగా క్రుగింపొతుందని భావించాడు తెర వెనుక దిలీప్.
కాని భావన ధైర్యంగా నిలబడింది. తనను కొంతమంది కిడ్నాప్ చేసి రేప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఐదు నెలలు క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృస్టించింది. ఈ ఒక్క ఫిర్యాదుతో దిలీప్ మైండ్ బ్లాంక్ అయిపోయింది. తనకు జరిగిన దారుణానికి భావన కృంగిపోతుందని, పరువు కోసం భయపడి ఎవరికీ చెప్పలేదని, ఆ వీడియోలతో తెలివిగా బ్లాక్ మెయిల్ చేయోచ్చని ఊహించుకున్నాడట దిలీప్. కాని భావన పరువు పోతుందనే ఫీలింగ్ పక్కన పెట్టింది. తనపై జరిగిన అఘహిత్యానికి న్యాయం కావాలని న్యాయపోరాటం చేసింది. అక్కడే దిలీప్ పతనం మొదలైపోయింది.
ఈ కేసులో అరెస్ట్ అయిన పల్సర్ సునీ, జైలు నుండి దిలీప్ అడ్రస్ కు ఓ లెటర్ రాశాడు. ”కేసులో మీ పేరు ఎక్కడా చెప్పలేదు. కొన్ని ఆర్ధిక సమస్యలు వున్నాయి. డబ్బులు కావాలి” అని ఆ లెటర్ లో వుంది. ఈ లెటర్ చదివిన దిలీప్ అమాయికుడిలా తనకు ఆ పల్సర్ సునీ ఎవడో తెలియదని నేరుగా అ లెటర్ ను పోలీసులకు ఇచ్చి అతి మంచితనం ప్రదర్శించాలని చూశాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. భావనకు ఓ ఉచిత సలహా కూడా ఇచ్చాడు. ఆమెకు వున్న పరిచయాలు వల్లే ఈ దారుణం జరిగిందని, ఆమె మంచి స్నేహాలు చేయాలని, మంచి పరిచయాలు వుంచుకోవాలని ఓ ఉచిత సలహా ఇచ్చాడు. ఈ మాటలు విన్న భావన మళ్ళీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈసారి దిలీప్ మాటలపై. భావన ఫిర్యాదు, పల్సర్ సుని లెటర్.. ఈ రెండు విషయాలపై బాగా ఫోకస్ చేసిన పోలీసులు తీగ లాగారు. దిలీప్ డొంక కదిలిపోయింది. పల్సర్ ఎవడో తనకు తెలియదని దిలీప్ ఇచ్చిన మొదటి స్టేట్మెంట్. ఇది పచ్చి అభద్దం అని తేలిపోయింది. పల్సర్ తో దిలీప్ దిగిన కొన్ని ప్రైవేట్ ఫోటోలు దొరికిపోయాయి. దీంతో అ దిశగా విచారణ మొదలుపెట్టిన పోలీసులకు నిజాలు తెలిసిపోయాయి. పక్కా ఆధారాలతో దిలీప్ ను అరెస్ట్ చేసి పోలీసు అసలు నిజాలను రాబట్టేశారు. భావనపై పగతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు విచారణలో తేలిపోయినట్లు పోలీసులు కధనం వచ్చేసింది.
అక్రమ సంబంధం పెట్టుకోవడమే నేరం. మళ్ళీ అది బయటికి తెలిసిందని రివెంజ్ పెట్టుకున్నాడు దిలీప్. జరిపోయిందేదో జరిగింది. తను కోరుకున్న మనిషితో రెండో పెళ్లి జరిగింది. ఇక్కడితో శుభం కార్డు వేయాలని అనుకోలేదు. డబ్బు, పలుకుబడి వుందనే అహంతో ఓ ఆడకూతురు జీవితాన్ని నాశనం చేయాలనీ కంకణం కట్టుకున్నాడు. ఇప్పుడు తనే నాశనం అయిపోయాడు.