వెంకటేష్, వరుణ్‌తేజ్ కథానాయకులుగా ఓ మల్టీస్టారర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. తమన్నా, మెహరీన్ కథానాయికలుగా నటించనున్నారు. ‘ఎఫ్ 2’ అనే పేరు పెట్టారు. ఫన్ అండ్ ఫస్ట్రేషన్ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ని సంగీత దర్శకుడిగా ఎంచుకున్నారు. ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ఈనెల 23న ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. 30 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలైపోతుంది. ముందు వెంకటేష్‌కి సంబంధించిన సన్నివేశాలతో సినిమా షూటింగ్ మొదలెడతారు. `అంతరిక్ష్యం`లో బిజీగా ఉన్న వరుణ్ ఆ తరవాత మెల్లగా జాయిన్ అవుతాడు. కథా ప్రకారం లండన్‌లో కొన్ని కీలక ఘట్టాలు తెరకెక్కించాల్సివుంది. అందుకే అక్కడ ఓ భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. అనసూయ ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతోంది. ఆమె పాత్ర తప్పకుండా అందరికీ షాక్ ఇస్తుందని సమాచారం. 90 రోజుల్లో షూటింగ్ పూర్తి చేయాలన్నది దిల్‌రాజు ప్లానింగ్. అనిల్ రావిపూడి.. కాస్త ఫాస్ట్‌గానే పని పూర్తి చేస్తాడు. కాబట్టి అనుకున్న సమయంలోనే ఈ మల్టీస్టారర్ పూర్తి కావొచ్చు.