ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధుల సాయం అందుతోంది. ప్రపంచబ్యాంక్ పదిహేను వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. దీనికి సంబంధించిన రాతకోతలన్నీ పూర్తయ్యాయి. ఇక పనులు ప్రారంభిస్తే దానికి తగ్గట్లుగా నిధులు మంజూరు అవుతూ ఉంటాయి. తాజాగా టిడ్కో కూడా 11 వేల కోట్లు విడుదలకు నిర్ణయం తీసుకుంది ముంబై లో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధుల విడుదలకు అనుమతి మంజూరు చేశారు. అంటే అమరావతి నిర్మాణానికి అసలు నిధుల కొరత లేదని స్పష్టమయింది.
అమరావతిపై పక్కా ప్రణాళికతో ఉన్న ప్రభుత్వం ఏడు నెలలుగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంది. పనులకు ఆమోదంతెలిపింది. ఇప్పుడు టెండర్ల దశలో ఉన్నాయి. టెండర్లు ఖరారు అయిన వెంటనే పనులు ప్రారంభం కానున్నాయి. జగన్ రెడ్డి హయాంలో శిధిలంగా మారిపోయిన అమరావతిని ప్రస్తుతం సాధారణ స్థితికి తీసుకు వచ్చారు. పనులు ప్రారంభించేందుకు అవసరమైన అన్ని ప్రక్రియలు పూర్తి కావడంతో కాంట్రాక్ట్ పొందిన నిర్మాణ సంస్థలన్నీ వరుసగా పనులు ప్రారంభించే అవకాశం ఉంది.
2019 ఎన్నికల ఫలితాల రోజుకు ముందు అమరావతిలో రేయింబవళ్లు పనులు జరిగేవి. కొన్ని వేల మంది కార్మికులు పనులు చేస్తూ ఉండేవి. ప్రభుత్వ నిర్మాణాలు, ప్రైవేటు నిర్మాణాలతో ఓ భవిష్యత్ నగర్ నిర్మాణం జరుగుతోందని అనుకునేవారు. కానీ రాత బాగోలేదు. అమరావతి కట్టడం చంద్రబాబుకు చేత కావడం లేదని అంతకు మించి కడతానని వచ్చిన జగన్ రెడ్డి అసలు విధ్వంసం చేసి చూపించారు. ఐదు సంవత్సరాల పాటు అమరావతి చంపడానికి చేయాల్సినదంతా చేశాడు. కానీ సక్సెస్ కాలేకపోయారు. ఇప్పుడు ఆయన పాతాళానికిపోయారు. అమరావతి రైజ్ అవుతోంది.