విజయవాడలో ఊహించని వరదలు లక్షల మందికి కష్టాలు తెచ్చి పెట్టాయి. ప్రభుత్వం నేనున్నానని ఎంత సాయం చేసినా… ఇంకా ఎంతో కొంత చేయాల్సిన సాయం మిగిలే ఉంటుంది. అందుకే ఎంతో మంది మానవతా వాదులు ముందుకు వస్తున్నారు. ఎవరికి తోచిన రీతిలో వారు సాయం చేస్తున్నారు. చిన్నా, పెద్దా పారిశ్రామిక వేత్తలు .. రూ. కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇస్తున్నారు. నిధులు మాత్రమే కాదు.. నిత్యావసర వస్తువులు, ఆహారం, నీళ్లు కూడా విస్తృతంగా పంపిణీ చేస్తున్నారు.
బెజవాడలో ఇప్పుడు ముంపు తగ్గింది. ప్రజలు ఇళ్లకు వస్తున్నారు. కానీ వారు ఇళ్లలోకి వరద వచ్చి పోయిన తర్వాత అంతా ఖాళీ అయిపోయింది. అందుకే ప్రభుత్వం ఇల్లు కడిగించే పనులు కూడా చేయిస్తోంది. సమయంలో ఇతర మానవతా వాదులు కూడా తమ సాయాల్ని ప్రకటిస్తున్నారు. స్వచ్చంద సంస్థలు, టీడీపీ నేతలు అందరూ … సమన్వయం చేసుకుని సాయం చేసేందుకు పెద్ద ఎత్తున వస్తున్నారు దీంతో అక్కడి ప్రజలకు ఊరట లభిస్తోంది. తమ కోసం చాలా మంది ఉన్నారన్న భావనతో వారికి ధైర్యం కలుగుతోంది.
వందేళ్లలో ఎప్పుడూ రాని కష్టం బెజవాడ వాసులకు వచ్చింది. రాబందులు వచ్చి పడినా… తమను తాము రక్షించుకోవడం కోసం .. వారిని రక్షించడం కోసం వస్తున్న వారితో మానవత్వం పరిమళిస్తోంది. ఒకరికి ఒకరు తోడుండాలనే సూత్రాన్ని బెజవాడ వరదలు నిరూపించాయి. ఉంటామని ఏపీలోని మానవతా వాదులు నిరూపిస్తున్నారు.