హైదరాబాద్ అంటేనే హాట్ ఫేవరేట్. అలాంటి నగరానికి నలువైపులా ఇళల్లకు.. ఇళ్ల స్థలాలకు మంచి డిమాండ్ ఉంటుంది. అయితే ట్రెండ్ అంటూ చాలా మంది ఒకే వైపు దృష్టి పెట్టడంతో ట్రెండ్ అటు వైపు ఉంటుంది. ధరలు కూడా అటు వైపు ఎక్కువగా ఉంటాయి. కానీ ఒక్కో సారి అభివృద్ధికి ఎంతో అవకాశం ఉన్నా… సరే కొంత వెనుకబాటు ఉండే ప్రాంతాలు ఉంటాయి. అలాంటి వాటిలో శ్రీశైలం హైవే వైపు ఉండే ప్రాంతాలు కొన్ని ఉంటాయి .
నిజానికి ఐటీ కారిడార్ కూడా విస్తరించకముందు రియల్ వ్యాపారం ఎక్కువగా శ్రీశైలం హైవే వైపు ఎక్కువగా ఉండేది. తర్వాత వివిధ రకాల ప్రాజెక్టుల కారణంగా డిమాండ్ నలు దిక్కులకు మారింది. అయితే శ్రీశైలం హైవే వైపు మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో రియల్ ఎస్టేట్ పుంజుకోలేదు. భవిష్యత్ లో బంగారం అవుతాయని అంచనా వేసినవాళ్లు మాత్రం… పెట్టుబడి పెట్టి ఉన్నారు. ఇప్పుడు కొంత మంది వ్యూహాత్మకంగా శ్రీశైలం హైవే వైపు చూస్తున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫోర్త్ సిటీ ముచ్చెర్ల వద్ద వస్తుంది. అక్కడ్నుంచి శ్రీశైలం హైవే పదిహేను కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. హైదరాబాద్ కి, ఇటు ముచ్చెర్లకి రెండిటికీ దగ్గర్లో ఉంది శ్రీశైలం హైవే ఉంటుంది. అందుకే భారీగా పెట్టుబడి పెట్టడం కన్నా.. సింపుల్గా పెట్టుబడి పెట్టి ఎక్కువ రిటర్న్స్ తెచ్చుకోవాలనుకునేవాళ్లు… శ్రీశైలం హైవే వైపు చూస్తున్నారు. ముచ్చెర్లలో ఫోర్త్ సిటీ పనులు ప్రారంభమైతే శ్రీశైలం హైవే చుట్టూ డిమాండ్ అనూహ్యంగా పెరగనుంది.
శ్రీశైలం హైవేలో వెంచర్లకు కొదవ లేదు. పాతిక లక్షలకు రెండు వందల గజాల వరకూ స్థలం లభిస్తోంది. ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోలేకపోయినా.. మరో పదేళ్ల తర్వాత అక్కడ పెద్ద పెద్ద కాలనీలు విస్తరించే అవకాశం ఉంది. అందుకే ఇటీవలి కాలంలో శ్రీశైలం హైవే వేపు.. ఎంక్వయిరీలు పెరుగుతున్నాయి. వచ్చే రెండు, మూడు నెలల్లో… బడా కంపెనీలు కూడా అటు వైపు చూసే అవకాశం ఉంది.