మలయాళంలో సూపర్ హిట్టయిన సినిమా ‘నాయట్టు’. 2021లో విడుదలైంది. అప్పుడే… గీతా ఆర్ట్స్ ఈ సినిమా రీమేక్ రైట్స్‌ని దక్కించుకొంది. కరుణకుమార్కి దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. రావు రమేష్, అంజలి, రాహుల్ రామకృష్ణల సెటప్‌తో ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్దామనుకొన్నారు. కానీ అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. దాంతో… నాయట్టు రీమేక్ పక్కన పెట్టేశారనుకొన్నారంతా. అయితే ఇప్పుడు మళ్లీ ఈ రీమేక్ వెలుగులోకి వచ్చింది.
గీతా ఆర్ట్స్ 2 సంస్థ ఈరోజు ఓ కొత్త చిత్రాన్ని ప్రకటించింది. కోట బొమ్మాళీ పీఎస్ అనే పేరుతో మోషన్ పోస్టర్ని వదిలింది. శ్రీకాంత్, శివానీ రాజశేఖర్, రాహుల్ విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. `జోహార్` ఫేమ్ తేజ మార్ని దర్శకత్వం వహిస్తున్నాడు. మోషన్ పోస్టర్ ఆకట్టుకొనేలా ఉంది. నాయట్టు కథని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చినా, మాతృకలోని `రా`నెస్ని యధాతధంగా కళ్ల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు అర్థమైంది. గీతా ఆర్ట్స్ 2 సంస్థ ఇప్పటి వరకూ క్రేజీ సినిమాలే చేస్తూ వస్తోంది. విజయాల శాతం కూడా ఎక్కువే. కోట బొమ్మాళీ కూడా హిట్ చిత్రాల జాబితాలో చేరుతుందన్నది నిర్మాత బన్నీవాస్ నమ్మకం. నటీనటులు, టెక్నికల్ టీమ్ స్ట్రాంగ్ గానే ఉంది. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.