‘గబ్బర్ సింగ్’ పంచిన వినోదం ఒక ఎత్తు.. అందులో ‘అంత్యాక్షరి’ఎపిసోడ్ మరో ఎత్తు. ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేశారు ఆ ఎపిసోడ్ ని. ఒకలా చెప్పాలంటే ఆ సినిమా వినోదంలో ‘అంత్యాక్షరి’ ఎపిసోడ్ పీక్స్. ఆ సీన్ లో కనిపించిన విలన్ బ్యాచ్ అంతా ‘గబ్బర్ సింగ్ అంత్యాక్షరి’గ్యాంగ్ పేరుతో పాపులరైపొయిందటే అర్ధం చేసుకోవచ్చు గబ్బర్ అంత్యాక్షరి ఎంతలా వర్క్ అవుట్ అయ్యిందో. అయితే ఇప్పుడు మరోసారి ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయాలని భావిస్తున్నాడు దర్శకుడు హరీష్ శంకర్.
అల్లు అర్జున్- హరీష్ శంకర్ కలయికలో ఓ సినిమా తెరకెక్కుతోంది. అదే డిజే( దువ్వాడ జగన్నాధం). దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం పూజ హెగ్డే హీరోయిన్. ఈ సినిమాలో అదిరిపోయే’అంత్యాక్షరి’ఎపిసోడ్ ను రాశాడట హరీష్. ఈ ఎపిసోడ్ మళ్ళీ నవ్వులు కురిపించడం ఖాయమని యూనిట్ వర్గాల భావిస్తున్నాయి.
గబ్బర్ సింగ్ ‘అంత్యాక్షరి’ని కొంతమంది దర్శకులు ప్రయత్నించారు. వెంకటేష్ షాడో, శ్రీను వైట్ల ఆగడు.. పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ లో ఇదే తరహ ఎపిసోడ్లను డిజైన్ చేశారు. అయితే ఇవి పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఇప్పుడు మళ్ళీ హరీష్ శంకరే గబ్బర్ ‘అంత్యాక్షరి’మ్యాజిక్ ను బన్నీ కోసం రాసుకున్నాడు. మరి ఈ మ్యాజిక్ ఎలా వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.