మెగా ఫ్యాన్స్ ని ఎలా పడేయాలో సాయిధరమ్ తేజ్ కి బాగా తెలుసు. రేయ్ సినిమా నుంచీ.. ఆ పనిలోనే ఉన్నాడు ఈ మెగా మేనల్లుడు. పవన్‌కల్యాణ్‌నీ, చిరంజీవినీ కంబైన్డ్‌గా వాడుకొంటూ ఆకట్టుకొంటున్నాడు. తన సినిమాలో ఏదో ఓ చోట మావయ్యల ప్రస్తావన తీసుకొస్తూ… మెగా ఫ్యాన్స్‌ని తనవైపుకు తిప్పుకొంటున్నాడు. తాజాగా సుప్రీమ్లోనూ ఇదే ఫాలో అయిపోయాడు. సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. ఈ గురువారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సినిమాలోని ఓ సందర్భంలో పవన్ కల్యాణ్ గబ్బర్‌సింగ్ సీన్‌ని వాడుకొన్నాడు సాయి. గబ్బర్ సింగ్‌లో పవన్‌కల్యాణ్ వైట్ అండ్ వైట్ డ్రస్సు వేసుకొని, కళ్లజోడు పెట్టుకొని బ్యాండు మేళంతో సహా పెళ్లి చూపులకు వెళ్తాడు కదా.. సేమ్ టూ సేమ్ ఆ సీన్‌ని యాజ్ ఇట్ ఈజ్ దింపేశాడు సాయిధరమ్. దానికి సంబంధించిన పోస్టర్ కూడా బయటకు వచ్చిందిప్పుడు. టైటిలేమో పెద మావయ్యది, అందులో పాట కూడా ఆయనదే. సీనేమో చినమావయ్యది. మొత్తానికి సుప్రీమ్ లో ఈ మెగా వాడకం పీక్స్‌కి వెళ్లిపోయినట్టే ఉంది