ఏపీలో ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలో గాదె శ్రీనివాసలనాయుడు విజయం సాధించారు. ఈయనకు బీజేపీ మద్దతుగా నిలిచింది. బీజేపీ మద్దతుతో గాదె శ్రీనివాసులునాయుడు పోటీ చేసి విజయం సాధించారు. టీడీపీ,జనసేన మద్దతు ఇచ్చిన పాకలపాటి రఘువర్మ స్వల్ప తేడాతో ఓడిపోయారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో గాదె శ్రీనివాసులునాయుడు గెలిచారు. వైసీపీ మద్దతు ఇచ్చిన కె విజయగౌరి అనే అభ్యర్థి కేవలం 5,900 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.
అయితే వైసీపీ మాత్రం కూటమి మద్దతు ఇచ్చిన రఘువర్మ ఓడిపోయారని ప్రచారం చేస్తోంది. అయితే కూటమి పార్టీలు ఏకపక్షంగా ఒకే అభ్యర్థికి మద్దతు తెలియచేయలేదు. బీజేపీ విడిగా గాదె వెంట నిలిచింది.అలా చూసినా గెలిచింది కూటమి అభ్యర్థే అనుకోవాలి. కానీ వైసీపీ ప్రచారం మాత్రం భిన్నంగా ఉంది. తమకు కింద కాలిపోయినా..ఊదుకుంటూ కూటమికి కాలిపోయిందని సంతోషపడుతోంది.
మరో వైపు రెండు గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం పోటీ చేయలేకపోయారు. కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, కూటమి బలపరిచిన అభ్యర్ధి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మూడు రౌండ్లు ముగిసే సరికి 30వేల ఓట్ల ఆధిక్యంలో ున్నారు. వైసీపీ తీవ్రంగా ప్రయత్నించిన పీడీఎఫ్ అభ్యర్ధి కే ఎస్ లక్ష్మణరావు ఘోరపరాజయం ఖాయంగా కనిపిస్తోంది.
అసలు ఫలితాలు తమకు వ్యతిరేకంగా వచ్చినా సరే.. అడ్డగోలు ప్రచారంతో.. ప్రజల్ని నమ్మించాలనుకుంటోంది వైసీపీ. కానీ జనానికి నిజం తెలియకుండా ఉంటుందా?