విశాఖలోని గాదిరాజు ప్యాలెస్ ఉన్న స్థలాన్ని వివాదంలోకి నెట్టింది నిజమేనని తేలింది. అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణలను ఖండించాలని ఆయనతో వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టించారు. విశాఖ వైసీపీ నేతలు కేకే రాజు.. ఇలాంటి భూదందాల్లో వైసీపీ తరపున జీపీఏ చేయించుకున్నట్లుగా విశాఖలో పెత్తనం చెలాయించే.. జీవీ అలియాస్ గన్నమనేని వెంకటేశ్వరరావు ఇద్దరూ కలిసి గాదిరాజు ప్యాలెస్ ఓనర్, ఆయన కుమారుడితో ప్రెస్ మీట్ పెట్టించారు. వారు ఎదురుగా నిలబడి మరి.. తాము చెప్పించాలనుకున్నది చెప్పించారు. తమపై ఒత్తిళ్లు లేవని వారు భయంభయంగా చెప్పి వెళ్లిపోాయరు.
కానీ వారు తమ ప్యాలెస్ పై లేనిపోని వివాదాల్ని తీసుకొచ్చారని చెప్పకనే చెప్పారు. 1994లో కొనుక్కున్న భూమిపై ఇప్పుడు వివాదం లేవదీశాని..క్రమబద్దీకరించుకోవాలని నోటీసులు ఇచ్చారని చెప్పకనే చెప్పారు. కలెక్టర్ ను కలవలేదన్నట్లుగా చెప్పుకొచ్చారు. వైసీపీ నేతలది మొదటి నుంచి ఇదే పని. బెదిరించడం.. ఆస్తులు రాయించుకోవడం.. కాదని బయటపెడితే.. వారితోనే ప్రెస్మీట్లు పెట్టించడం. అంతా సెటిల్మెంట్ గ్యాంగ్ పక్కా వ్యూహంతో ఇదే పనులకు పాల్పడుతోంది.
గాదిరాజు ప్యాలెస్ వ్యవహారం విశాఖ ప్రజల్లో సంచలనంగా మారింది. ఇక ఎవరి ఆస్తులకు గ్యారంటీ ఉంటుందని వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పై స్థాయిలో ప్యాలెస్ లపై దృష్టిపెడితే… కింది స్థాయి వైసీపీ నేతలు.. సామాన్యుల ఆస్తులపై పడుతున్నారు. ఒంగోలులో బయటపడిన.. న కిలీ డాక్యుమెంట్ల స్కామ్ తరహా ఘోరాలు విశాఖలోనూ జరుగుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.