గాలి జనార్దన్ రెడ్డి గతంలో చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఒక ప్రముఖ ఛానల్ (ఆంధ్రజ్యోతి) లో ఇంటర్వ్యూ ఇచ్చిన గాలి జనార్దన్ రెడ్డి తాను అప్పట్లో బాబును ఉద్దేశించి చేసిన పరుషమైన వ్యాఖ్యలపై తన మనోగతాన్ని వెల్లడించారు.
ఆ ఇంటర్వ్యూ లో భాగంగా టివి ఛానెల్ వాళ్ళు గతం లో గాలి జనార్ధన్ రెడ్డి మాట్లాడిన వీడియో క్లిప్పులని ఆయనకే ప్రదర్శించారు. ఆ పాత వీడియోలో ఆయన మాట్లాడుతూ “చంద్రబాబు, నీ కార్యకర్తలు నా ఇంటి మీద దాడి చేసారు. నీకు దమ్ముంటే డైరెక్ట్ గా ఫేస్ చేయి. నువ్వు కొజ్జా నంబర్ వన్” అంటూ అప్పట్లో బాబు పై విరుచుకుపడ్డారు. అయితే ఆ వీడియో ఇప్పుడు తన ముందు ప్రదర్శించడం తో గాలి జనార్దన్ కుంచించుకుపోయారు. గాలి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ – ” హైదరాబాద్లో నా ఇంటి వద్దకు తెలుగుదేశం కార్యకర్తలమని కొందరు వచ్చి రాళ్లు వేశారు. ఆ ఎమోషన్లో స్పందించాను. ఇప్పటికీ దాని గురించి తలచుకుంటుంటాను. ఒక మనిషికి మెచ్యూరిటీ లెవల్స్ ఉంటాయి. అలా నేను మాట్లాడకుండా ఉండి ఉంటే బాగుండేది అని ఇప్పటికీ అనుకుంటూ ఉంటాను. దాని గురించి ఆ తర్వాత చాలా బాధపడ్డాను.”
ఏది ఏమైనా ఇంటర్వ్యూ చూసినవారంతా ఫీలయింది ఏంటంటే, ఒకప్పటి గాలి జనార్ధన్ రెడ్డి మాటతీరుకీ, ఇప్పటి మాట తీరుకీ చాలా తేడా ఉంది, బహుశా జైలు కి వెళ్ళడానికి ముందుకీ, జైలు నుంచి వచ్చిన తర్వాతకీ ఆయన మెచ్యూరిటీ లెవల్స్ లోనూ, జీవితం పట్ల ఆయన దృక్పథం లోనూ తేడా వచ్చినట్టు అనిపించింది. ఆయన కూడా ఈ విషయాన్ని అంగీకరించారు.