ఈ సంక్రాంతికి విడుదల అవుతున్న సినిమాల్లో ‘గేమ్ ఛేంజర్’ ఒకటి. జనవరి 10న వస్తోంది. ఈలోగా ప్రమోషన్లు కూడా జోరందుకొన్నాయి. ఈ సినిమా నుంచి ‘దోప్’ అనే గీతాన్ని తాజాగా విడుదల చేశారు. తమన్ స్వరపరచిన పాట ఇది. రామ జోగయ్యశాస్త్రి రాశారు. జానీ మాస్టర్ నృత్యరీతులు సమకూర్చారు.
విజువల్స్ శంకర్ స్థాయిలో కలర్ఫుల్గా ఉన్నాయి. కంపోజీషన్లో ఓ స్టైల్ ఉంది. మాస్‌కి త్వరగా ఎక్కే పాట కాదు. వినగా వినగా ఈ లూప్ లో పడిపోవొచ్చు. చరణ్, కైరా జోడీ ఆకట్టుకొనేలా వుంది. చరణ్ ప్టెప్పులు ఓరకంగా అదిరిపోయాయి. చాలా క్లాసీగా ఉన్నాయి. మనీష్ మల్హోత్రా కాస్ట్యూమ్స్ అదనపు ఆకర్షణ. శంకర్ సినిమాల్లో ముఖ్యంగా పాటల్లో భారీదనం ఉట్టిపడుతుంది. ఈ పాటలోనూ అది కనిపించింది. రామజోగయ్య సాహిత్యంలో ఎక్కువగా ఇంగ్లీష్ పదాలు దొర్లాయి. దోప్ అనే పదం హుక్ లైన్‌గా వాడుకొన్నారు. ఈ పదానికీ కథకూ, హీరో పాత్రకూ సంబంధం ఉంది. అదేమిటన్నది తెరపై చూడాలి.
ఇప్పటి వరకూ ఈ సినిమా నుంచి రెండు పాటలు వచ్చాయి. ఇది మూడో గీతం. మరో రెండు పాటలు విడుదలయ్యే ఛాన్సుంది. ఈనెల 27న ట్రైలర్ ఆవిష్కరించనున్నారు. హైదరాబాద్ లో ఓ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. జనవరి 4న రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.