పైరసీ భూతం సినీ పరిశ్రమకు ఔషదం లేని పీడలా పట్టుకుంది. థియేటర్లలో కొత్త సినిమా విడుదలైతే చాలు.. తొలి ఆట ముగిసిన నిమిషాల్లో సినిమా వేర్వేరు వెబ్సైట్లలో ప్రత్యక్షమవుతోంది. కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్న సినిమాలను కొందరు రికార్డు చేసి వెబ్సైట్లలో పెడుతున్నారు. ఈ పైరసీని నిలువరించేందుకు సినీ నిర్మాతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలు ఇవ్వడంలేదు.
ఈ రోజు రిలీజైన గేమ్ ఛేంజర్ పైరసీ బారిన పడింది. మూవీ రూల్జ్ లో సినిమా ప్రత్యేక్షమైయింది. నేరుగా వెబ్ సైట్ లో స్ట్రీమ్ కావడంతో పాటు టోరెంట్ కూడా డౌన్ లోడ్ అవుతోంది. ఇది థియేటర్ ప్రింట్. ఎక్స్ వేదికగా ఈ సినిమా హెచ్డీ వీడియో క్లిప్స్ కూడా తిరుగుతున్నాయి. తొలి రోజు గవడకుండానే సినిమా ఇలా పైరసీ బారిన పడటం నిర్మాతలని కుదేలు చేస్తుంది. ఇప్పటికే సినిమాకి సరైన రివ్యూలు రాలేదు. శంకర్ మేకింగ్ టేకింగ్ ఓల్డ్ స్కూల్ లా వుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు పైరసీ రూపంలో మరో షాక్ తగిలింది.